Site icon HashtagU Telugu

Sleeping Benefits: ఉత్తర దిశ వైపు తలపెట్టి ఎందుకు పడుకోకూడదో మీకు తెలుసా?

Sleeping Benefits

Sleeping Benefits

ఇంట్లో పెద్దలు పడుకునేటప్పుడు ఉత్తర దిశగా తలపెట్టి పడుకోకూడదని చెబుతూ ఉంటారు. ఎందుకు అంటే ఏవేవో కారణాలను చెబుతూ ఉంటారు. ఇంకొందరు చెప్పింది చెయ్యి ప్రశ్నలు వేయొద్దు అని పిల్లలను అరుస్తూ ఉంటారు.. మరి నిజానికి ఉత్తర దిశగా ఎందుకు పడుకోకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఉత్తరానికి అధిపతి కుబేరుడు. దక్షిణానికి అధిపతి యముడు. ఉత్తర దిశగా తలపెట్టి పడుకున్నప్పుడు లేవగానే దక్షిణా దిశ వైపు చూస్తారనే ఉద్దేశంతో ఉత్తర దిశలో తలపెట్టి పడకూడదని చెబుతున్నారు. సైన్స్ ప్రకారం చూసుకుంటే..

దక్షిణం నుంచి ఉత్తరానికి నిరంతరం ప్రయాణిస్తూ ఉంటాయి. అలా ఉత్తరం దిశలో పడుకోవడం వల్ల మన రక్త ప్రసరణ వ్యతిరేక దిశలో కొనసాగడం వల్ల మనలోకి తెలియని నెగిటివ్ శక్తి మనలో ప్రవేశిస్తుంది. ఒత్తిడికి నిద్ర సరైన మందు. చాలా సందర్భాల్లో ప్రజలు నిద్రిస్తున్నప్పుడు ఏ దిశలో నిద్రపోతామనే విషయమై అంతగా శ్రద్ధ చూపరు. కానీ వాస్తు శాస్త్రంలో ఎలా పడితే అలా పడుకోవడం నిషేధం.ఇది తప్పుగా పరిగణించబడుతుందని చెబుతున్నారు. నిద్రపోయేటప్పుడు దిశపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. అది వాస్తు దోషానికి కారణం అవుతుంది. ఇది జీవితంపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశాలు ఉన్నాయి.

మీ తల ఉత్తరం వైపు పాదాలు దక్షిణం వైపు అస్సలు ఉండకూడదట. హిందూ మతంలో చనిపోయినవారిని మాత్రమే ఉత్తరం వైపు తల పెట్టి అంత్యక్రియలు చేస్తారు. తలను ఉత్తరం వైపు, పాదాలను దక్షిణం వైపు ఉంచడం ద్వారా ఆత్మ శరీరాన్ని విడిచిపెడుతుందని నమ్ముతారు. దక్షిణం యమ స్థానం. అందుకే ఉత్తరాన పడుకునే వారు నిద్ర లేస్తే మొదట చూసేది దక్షిణ దిశ కాబట్టి ఆ దిశలో నిద్రించకూడదని చెబుతారు. ఒక వ్యక్తి నిద్రిస్తున్నప్పుడు ఎల్లప్పుడూ తూర్పు వైపు తల ఉంచాలి. ఎందుకంటే సూర్యుడు తూర్పు దిక్కున ఉదయిస్తాడు. సూర్యుని వైపు తల పెట్టి పడుకోవడం మానసిక, ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందట. అలాగే దక్షిణం వైపు తల పెట్టి నిద్రించవచ్చు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉత్తరం వైపు తల పెట్టి పడుకోకూడదని పండితులు చెబుతున్నారు.