Site icon HashtagU Telugu

Bhogi Festival: ఈ ఏడాది భోగి పండుగ ఎప్పుడు.. ఈ పండుగను ఎందుకు జరుపుకుంటారు తెలుసా?

Mixcollage 10 Jan 2024 06 31 Pm 6216

Mixcollage 10 Jan 2024 06 31 Pm 6216

హిందువులు కొత్త సంవత్సరం జరుపుకునే మొట్టమొదటి పండుగ సంక్రాంతి. ఈ పండుగను మూడు రోజులపాటు ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. అంతేకాకుండా హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలలో ఈ పండుగ కూడా ఒకటి. పండుగ మూడు రోజులు కాగా.. మొదటి రోజు భోగి, రెండవ రోజు సంక్రాంతి, మూడో రోజు కనుమగా జరుపుకుంటూ ఉంటారు. సంక్రాంతి అనగానే భోగి మంటలు, హరిదాసు సంకీర్తనలు, కోడి పందాలు, ముగ్గులు పోటీలు, గంగిరెద్దు విన్యాసాలు గుర్తుకు వస్తూ ఉంటాయి.

ఇకపోతే 2024లో భోగి పండుగ జనవరి 14న వచ్చింది. మరి ఈ భోగి పండుగను ఎందుకు జరుపుకుంటారు ఈ భోగి ప్రత్యేకత ఏమిటి అన్న విషయానికి వస్తే.. భగ అనే పదం నుంచి భోగి పుట్టింది. దక్షిణాయనానికి చివరి రోజుగా భోగి పండుగను భావిస్తారు. ఈ క్రమంలో దక్షిణాయనంలో పడ్డ కష్టాలు, బాధలను భోగి మంటల రూపంలో అగ్ని దేవుడికి సమర్పించి రాబోయే ఉత్తరాయణ కాలంలో సుఖసంతోషాలను ప్రసాదించాలని ప్రజలు కోరుకుంటారు. ఈ పవిత్రమైన రోజున తెల్లవారు జామున లేచి స్నానం చేసి కొత్త బట్టలు ధరిస్తారు. అనంతరం భోగి మంటలు వేసి అందులో పిడకలు, ఇంట్లోని పాత వస్తువులు, పాత బట్టలను అగ్నికి అహుతి చేస్తారు.

మనలోని చెడును తగలబెట్టి, మంచిని పెంచుకోవడమే ఈ భోగిమంటల ప్రత్యేకత. అంతేకాకుండా భోగి రోజు బొమ్మల కొలువు చేసి… ముత్తాయిదవులను పిలిచి చిన్న పిల్లల మీద రేగుపళ్లు లేదా భోగి పోళ్లు పోయిస్తారు. ఇలా చేయడం వల్ల పిల్లల తలపై ఉండే బ్రహ్మ రంధ్రం ప్రేరేపితమై పిల్లలలు జ్ఞానవంతులు అవుతారని నమ్మకం.