Site icon HashtagU Telugu

Hibiscus: మందార మొక్క ఇంట్లో ఉంటే కలిగే అద్భుత ఫలితాలు ఇవే?

Hibiscus

Hibiscus

సాధారణంగా మనం ఇంటి ఆవరణలో ఎన్నో రకాల పూల చెట్లను పెంచుకుంటూ ఉంటాము. వాటిలో మందారం చెట్టు కూడా ఒకటి. ఈ మందారం చెట్లో కూడా అనేక రకాల మందార చెట్లు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ మందార పువ్వులు పూజకి అందానికి మాత్రమే కాదండోయ్ అనేక రకాల దోషాలను తొలగించడానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడతాయి. మందారపు చెట్లను ఇంటి ఆవరణలో పెంచుకోవడం వల్ల ఏదైనా వాస్తు దోషం ఉంటే దానిని నివారిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలంటే, ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు మంగళవారం హనుమాన్ దేవుడిని, శుక్రవారం లక్ష్మీదేవికి ఎర్ర మందార పువ్వును సమర్పించి పూజించడం ద్వారా ఆర్థిక సమస్యల నుంచి బయటపడవచ్చు.

అలాగే ఏదైనా విలువైన వస్తువు పోయినప్పుడు దేవుడికి ఎర్రమందాలకు పూలను సమర్పించడం వల్ల పోయిన వస్తువు వెంటనే దొరుకుతుంది. అదేవిధంగా సూర్యనారాయణున్ని పూజించినప్పుడు మందారం పువ్వు లేకుండా ఆరాధించడం అన్నది అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. మందారపు చెట్లను ఇంట్లో పెంచుకోవడం అది సానుకూల శక్తిని ఇస్తుంది. ఎరుపు సానుకూల శక్తిని ఇస్తుంది. ఇంటికి తూర్పు దిక్కున ఎర్ర మందార చెట్టును నాటడం వల్ల ఫలితం ఉంటుంది. ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీని తొలగించి పాజిటివ్ ఎనర్జీగా మార్చుతుంది. సూర్యుని బలపరుస్తుంది. జాతకంలో సూర్యుని బలహీనత ఉన్న వ్యక్తి గ్రహ దోషాలను తొలగించడానికి ఈ పరిహారం చేయవచ్చు.

అలాగే పిల్లలు చదువుకునేటప్పుడు స్టడీ టేబుల్ పై ఎర్ర మందార పువ్వు ఉంచడం వల్ల చదువులో ఏకాగ్రత పెరుగుతుంది.ఇంట్లో ప్రతికూలత, సమస్యలు ఉంటే ధనం నిలవదు, అశాంతి ఉంటే వాస్తు నిపుణుల సలహా మేరకు ఇంట్లో మందార చెట్టును నాటితే ఎలాంటి సమస్యలు ఉన్న దూరం అవుతాయి. అలాగే ఎప్పుడూ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి మనశ్శాంతి లేదు అనుకున్న వారు కూడా మందారం చెట్టును తూర్పు లేదా ఉత్తర దిశలో నాటడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి.

Exit mobile version