Chavithi Special : వినాయక చవితి రోజు పొరపాటున చంద్రుడిని చూశారా, అయితే వెంటనే ఈ పనిచేసి తీరాల్సిందే..!!

సకలదేవతలకు అధిపతి వినాయకుడు. ఎవరు ఏ కార్యాన్ని ప్రారంభిస్తున్నా...ముందుగా వినాయకుడిని పూజించాల్సిందే.

  • Written By:
  • Publish Date - August 30, 2022 / 06:30 AM IST

సకలదేవతలకు అధిపతి వినాయకుడు. ఎవరు ఏ కార్యాన్ని ప్రారంభిస్తున్నా…ముందుగా వినాయకుడిని పూజించాల్సిందే. ఆయన అనుగ్రహాన్ని తప్పనిసరిగా పొందాల్సిందే. సాక్షాత్తు బ్రహ్మదేవుడు తన సృష్టి రచనకు ముందు వినాయకుడిని పూజించారని బుుగ్వేదం చెబుతోంది. అలాంటి వినాయకుడు పుట్టినరోజైన భాద్రపద శుద్ధ చవితి రోజున వినాయక చవితి జరుపుకుంటారు. అయితే వినాయక చవితి ఎందుకు జరుపుకుంటారు…ఆరోజున చంద్రుడిని చూస్తే ఏం జరుగుతుంది. తెలుసుకుందాం.

పురాణాల ప్రకారం…
పార్వతీదేవి కైలాసంలో…శివుడి కోసం ఎదురుచూస్తూ స్నానానికి సిద్ధమైంది. స్నానానికి వెళ్లే ముందు నలుగుపిండితో ఒక బాలుడి ప్రతిమను తయారు చేసి ప్రాణం పోసి వాకిట్లో కాపలా ఉంచి వెళ్తుంది. అంతలో అక్కడికి వచ్చిన శివుడిని ఆ బాలుడు అడ్డుకుంటాడు. ఆగ్రహానికి లోనైన శివుడు…ఆ బాలుడి శిరస్సును తన త్రిశూలంచే ఖండిస్తాడు. ఆ శబ్దానికి బయటకు వచ్చిన పార్వతీ..జరిగిన ఘోరం చూసి కన్నీటి పర్యంతం అవుతుంది.

దాంతో శివుడు…గజముఖుడి శిరస్సును తీసుకువచ్చి ఆ బాలుడి దేహానికి అతికించి ప్రాణం పోస్తాడు. అప్పుడు ఆ బాలుడికి గణననుడు అని నామకరణం చేస్తారు. ఆ బాలుడికి శక్తిసామర్థ్యాలను పరిశీలించి గణాధిపతిని చేస్తాడు. అలాంటి గణపతి నడించేందుకు ఇబ్బంది చూసి శివుడి శిరస్సు పైనున్న చంద్రుడు నవ్వుతాడు. దాంతో ఆరోజున అంటే( వినాయకచవితి)ఎవరైతే చంద్రుడిని చూస్తారో వారు నీలాపనిందలు ఎదుర్కొంటారని వినాయకుడు శపిస్తాడు. అందరూ కలిసి వినాయకుడికి నచ్చజెప్పడంతో ఆరోజున తన కథ చెప్పుకుని అక్షింతలు తలపై ధరించిన వారికి ఈ శాపం వర్తించదని చెబుతాడు. అందుకే వినాయకచవితి రోజున చంద్రుడిని చూడరు.

పాలపాత్రలో చంద్రుడిని చూసినందుకు శ్రీకృష్ణుడంతటి వాడుకూడా అపనిందలు మోయాల్సివచ్చింది. ఈ ప్రభావాన్ని గుర్తించిన దేవతలు..మానవులు వినాయకచవితి రోజున ఆయన్ను పూజించి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించాలన్నారు. ఆ రోజు నుంచి గణనాయకుడిగా, విద్యా విజ్ణాలను ప్రసాధించే అధినాయకుడిగా వినాయకుడు పూజలందుకుంటున్నాడు.

వినాయకచవితి రోజు చంద్రుడిని చూస్తే ఇలా చేయండి:
పొరపాటున వినాయకచవితి రోజున చంద్రుడిని చూసినట్లయితే మనస్సులో ఈ శ్లోకాన్ని చదువుకోండి.
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం

ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే

ఈ శ్లోకం చదివి మీ సమీపంలోని వినాయక మండంపంలోకి వెళ్లి, గణేషుడిని దర్శించుకొని అక్షింతలు వేసుకోండి. లేదంటే సర్వ విఘ్నోపశాంతయే అంటే అన్ని విఘ్నాలను తొలగించు వినాయక అని అర్థం, చంద్రుడిని చూసిన మీకు ఏమీ జరగదు.