Gemstones: అసలు, నకిలీ రత్నాల మధ్య తేడాను ఇలా తెలుసుకోండి

వ్యక్తి యొక్క జీవితం గ్రహాలు, రాశుల ప్రకారం నడుస్తుంది. గ్రహాల శాంతి మానవ జీవితంలో మార్పులను తీసుకువస్తుంది.

  • Written By:
  • Updated On - February 5, 2023 / 10:11 PM IST

Gemstones: వ్యక్తి యొక్క జీవితం గ్రహాలు, రాశుల ప్రకారం నడుస్తుంది. గ్రహాల శాంతి మానవ జీవితంలో మార్పులను తీసుకువస్తుంది.
గ్రహాలను శాంతింపజేయడానికి కొన్ని ప్రత్యేక రత్నాలను ధరిస్తారు. కానీ నిజమైన, నకిలీ రత్నాల మధ్య తేడాను ఎలా గుర్తించాలి ? రాశిచక్రం ప్రకారం రత్నాలను ఎలా ఎంచుకోవాలి ? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

రత్నం ఏదైనా సరే.. అది నిజమైనది అయితేనే లాభాలను ఇస్తుంది. ఫ్యాక్టరీలో తయారైన రత్నాలు ప్రయోజనాలను కలిగించవు. రత్నం నిజమైనదే అయితే అది జీవితాన్ని మార్చగలదు.  కానీ రత్నాలు ఫ్యాక్టరీలో తయారు చేయబడితే.. అది మీ జీవితంపై తప్పుడు ప్రభావాన్ని చూపుతుంది. అసలైన రత్నం ధరించడం ద్వారా మీరు ఖచ్చితంగా ఖ్యాతిని పెంచుకోవచ్చు.  ఏదైనా గ్రహానికి సంబంధించిన రత్నాన్ని ధరించాలని భావిస్తే.. ఆ రత్నం యొక్క స్వచ్ఛత ఎంత అనేది తెలుసుకోవాలి.ఈరోజుల్లో నగరాల్లో వివిధ చోట్ల ల్యాబొరేటరీలు తెరుచుకోవడం చూస్తున్నారు. ఒక వ్యక్తి ధరించే అన్ని రత్నాలు అక్కడ పరీక్షించబడతాయి.  ఈ ప్రయోగశాలలు రత్నాల స్వచ్ఛతను సూచించే కార్డును కూడా ఇస్తాయి.

● జీవితంపై రత్నాల ప్రభావం

నిజమైన రత్నం..మీ శరీరం లోపల దాగిన ఏదైనా గ్రహం యొక్క కిరణాలు, శక్తిని గ్రహించగలదు.  అంటే, గ్రహాల కిరణాలు రత్నాల మాధ్యమం ద్వారా ప్రయోజనాలను లేదా హానిని కలిగిస్తాయి.  చూడటానికి బాగుంది కదా అని రత్నపు ఉంగురాలు వేసుకోవద్దు. కలిగే ప్రయోజనం ఆధారంగా ఉంగరం ధరించాలి.

తేడాను ఇలా తెలుసుకోండి..

◆ పుష్పరాగము అనేది ఒక రత్నం. ఇది బంగారు రంగులో ఉంటుంది.  రూ. 20, 25, 50 నుండి ₹ 200 వరకు కూడా ఇది వస్తుంది. కానీ, అసలు పుష్యరాగం రత్నం ధర 1.5 లక్షల నుంచి 2 లక్షల వరకు ఉంటుంది.

◆ నిజమైన రత్నం వెల్వెట్ అనుభూతిని కలిగి ఉంటుంది.  రత్నం నకిలీది అయితే, నీటి చుక్క దానిపై స్థిరంగా ఉండదు.

◆ నిజమైన రత్నం పై నీటి చుక్క వేస్తే అది కదలదు.  నిజమైన రత్నం పై కొవ్వొత్తి చుక్క వేసి చీకటిలో ఉంచండి. అక్కడ కూడా రత్నం మెరుస్తూనే ఉంటుంది. మీరు నకిలీ వజ్రంపై మైనపు చుక్కను వేస్తే.. అది అస్సలు ప్రకాశించదు.

◆ గ్రహాలు మరియు జాతకం ఆధారంగా జ్యోతిష్కులు రత్నాలను ధరించమని సిఫార్సు చేస్తారు.

◆ మహాదశ ప్రకారం ఒక రత్నం చెప్పబడితే.. ఆ రత్నం వ్యక్తి జీవితంపై కూడా ప్రభావం చూపుతుంది.

◆ రాశిని బట్టి వజ్రాన్ని ధరించడం మంచిదని అంటారు. జాతకంలో ఉన్న దోషాన్ని బట్టి వజ్రాన్ని ధరిస్తే కూడా లాభాలు తప్పకుండా లభిస్తాయి.