Site icon HashtagU Telugu

Chavithi Special : గణపతి పూజా విధానము తెలుసుకోండి..!!

Ganesh (2)

Ganesh (2)

పూజా ఏదైనా…వ్రతం ఏదైనా…చివరకు ఏ చిన్న పని ప్రారంభించాలన్నా ముందుగా గణపతిని పూజించడం మన సాంప్రదాయం. అలాంటి వినాయకుడి జన్మదినంను వినాయక చవితి లేదా గణేశ్ చతుర్థిగా జరుపుకుంటారు. వినాయకుడి ప్రతిమను ఇంట్లో ప్రతిష్టించి…పూజ చేసి గరికతోపాటు 21 పత్రాలతో పూజించి…కుడుములు, ఉండ్రాళ్లను నైవేద్యంగా సమర్పిస్తారు. అసలు గణపతి పూజా ఎలా చేస్తారు. ఇప్పుడు తెలుసుకుందాం.

శుక్లాంబరధరం విష్ణుం శవివర్ణం చతుర్భుజం

ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే

అగజానన పద్మార్కం గజానన మహర్నిశం

అనేకదంతం భక్తానా మేకదంతముపాస్మహే

శ్లోకము : గురుర్ర్బహ్మ గురువిష్ణు : గురుర్దేవో మహేశ్వర:

గురుస్సాక్షాత్పరబ్రహ్మ తస్మై: శ్రీగురువేనమ:

పసుపుతో వినాయకుడిని తయారు చేసి తమలపాకుపై ఉంచి బొట్టుపెట్టి పూజ ప్రారంభించాలి.

ఇంట్లోని ఈశాన్యంలో ఉన్న స్థలాన్ని శుద్దిచేసి…అలికి…బియ్యం పిండితో ముగ్గులు పెట్టాలి. దైవస్థాపన కోసం పీట వేయాలి. పీట ఎత్తుగా గానీ…మట్టంగా గానీ ఉండరాదు. పీటకు పసుపు రాసి…కుంకుమతో బొట్టుపెట్టి బియ్యంపిండితో చక్కగా ముగ్గులు వేయాలి. అష్టదళ పద్మం ముగ్గు వేయాలి. ఒక పళ్లెంలో బియ్యం తీసుకుని దానిపై తమలపాకుతో వినాయకుడిని ఉంచాలి. పీటకు నైరుతిదిశలో దీపారాధనచేసి అగరవత్తులు వెలిగించాలి. ముందుగా కేశవనామాలు ఆచమనం వేయాలి. వినాయకుడికి పూజచేసి ఆ తర్వాత శ్రీవైభవలక్ష్మీకి పూజ ప్రారంభించాలి.

పసుపు గణపతి పూజ:
పసుపు గణపతికి ఎడమవైపున దీపారాధన చేసి సంకల్పము చెప్పుకోవాలి. ఆచమ్మ అని ఆచమనం చేయాలి. కుడిచేతి చూపుడు వేలుకు…మధ్యల వేలుకు మధ్యన బొటనవేల ఉంచి బొటవేలుపైకి మడిచి మిగతా మూడు వేళ్లు దాచి…అరచేతిని దోనేలా మడిచి ఉద్దరిణేడు ఉదకాన్ని ఎడమచేతితో కుడిచేతితో పోసుకుని..ముందుగా ఓం కేశవాయస్వాహా అంటూ తాగాలి. ఓ నారాయణస్వాహా అనుకుని ఒకసారి…ఓం మాధవాయ స్వాహా అని మరొకసారి జలం పుచ్చుకోవాలి. ఓం గోవిందాయనమ: అని చేతులు కడుక్కోవాలి. తర్వాత ఓం విష్ణవే నమ: అనుకుంటూ నీళ్లను తాకి కళ్లను తుడుచుకోవాలి.

ఆ తర్వాత‘‘మధుసూదనాయ నమ:’’

ఓం త్రివిక్రమాయ నమ:

ఓం వామనాయ నమ:

ఓం శ్రీధరాయ నమ:

ఓం హృషీకేశాయ నమ:

ఓం పద్మనాభాయ నమ:

ఓం దామోధరాయ నమ:

ఓం సంకర్షణాయ నమ:

ఓం వాసుదేవాయ నమ:

ఓం ప్రద్యుమ్నాయ నమ:

ఓం అనిరుద్ధాయ నమ:

ఓం పురుషోత్తమాయ నమ:

ఓం అధోక్షజాయ నమ:

ఓం నారసింహాయ నమ:

ఓం అచ్యుతాయ నమ:

ఓం జనార్ధనాయ నమ:

ఓం ఉపేంద్రాయ నమ:

ఓం హరయే నమ:

ఓం శ్రీకృష్ణయ నమ:

అంటూ కేశవనామాలతో పూజను ప్రారంభించాలి.
ఆత్మశుద్ధి :

‘‘అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగతో పవా

య: స్మరేత్పండరీకాక్షం – సబాహ్యంభ్యంతరశ్శుచి:’’

అంటూ స్నానం చేసినట్లుగా అనుకుంటూ తలపై నీళ్లు చెల్లుకోవాలి.

భూశుద్ధి :

‘‘ఉత్తిష్ణంతు భూతపిశాచా యేతే భూమి భారకా:

ఏతేషా మవిలోధేన బ్రహ్మకర్మ సమారభే’’

అంటూ చుట్టూ నీళ్లు చల్లుకోవాలి.

శుక్లాంబరధరం విష్ణుం శవివర్ణం చతుర్భుజం

ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే

అగజానన పద్మార్కం గజానన మహర్నిశం

అనేకదంతం భక్తానా మేకదంతముపాస్మహే

అంటూ పసుపు, కుంకుమ అక్షింతలు వినాయకునిపై వుంచాలి.

శ్లోకము : అపదా మపహర్తారం దాతారం సర్వసంపదాం

లోకాభిరామం శ్రీరామం భూయోభూయోనమామ్యహం

శ్లోకము : యశ్శివో నామరూపాభ్యం యాదేవీ సర్వమంగళా

శరణ్యే త్ర్యంబకే దేవి! నారాయణి నమోస్తుతే

కుడిచేతితో ముక్కును పట్టుకుని ప్రాణామయ మంత్రం పఠించాలి.
ఆ తర్వాత సంకల్పం చెప్పాలి.