Vastu Tips : ఇంట్లో శాంతి, సంతోషాల కోసం 5 వాస్తు చిట్కాలు ఇవిగో..

ఒకరి జీవన నాణ్యతను మెరుగుపరచడానికి ప్రకృతి (Nature) యొక్క అన్ని శక్తులను సమతుల్యం చేయడమే వాస్తు యొక్క ప్రాథమిక లక్ష్యం.

ఒకరి జీవన నాణ్యతను మెరుగుపరచడానికి ప్రకృతి యొక్క అన్ని శక్తులను సమతుల్యం చేయడమే వాస్తు (Vastu) యొక్క ప్రాథమిక లక్ష్యం. మీరు కొన్ని సాధారణ వాస్తు మార్పులు చేయడం ద్వారా ఇంట్లో శాంతిని, సామరస్యాన్ని పెంపొందించుకోవచ్చు. నైరుతి దిక్కు భర్త-భార్య, తల్లిదండ్రుల-పిల్లల సంబంధాలను ప్రభావితం చేస్తే.. వాయువ్యం దిక్కు మీ కుటుంబంతో మీ సంబంధాన్ని మెరుగుపరుస్తుంది. వాస్తు నిపుణులు చెబుతున్న కొన్ని చిట్కాలు ఇప్పుడు తెలుసుకుందాం..

సంతోషకరమైన కుటుంబం కోసం 5 వాస్తు (Vastu) శాస్త్ర చిట్కాలు:

ప్రవేశ ద్వారానికి అలంకారం:

ఇంటి ప్రవేశ ద్వారాన్ని అందమైన వస్తువులతో అలంకరించండి. ఇంటి ప్రవేశ ద్వారం చుట్టూ చాలా వైబ్‌లు, శక్తులు ప్రవహిస్తాయి. ఇవి ఆ ఇంట్లో నివసించే వ్యక్తుల జీవితం, సంబంధాలను ప్రభావితం చేస్తాయి. మీ ఇంట్లోకి వచ్చే వాళ్ళు, వెళ్లే వాళ్ళ తొలి చూపు, తొలి అడుగు ప్రవేశ ద్వారం పైనే పడుతుంది.

తూర్పు దిక్కును సరిగ్గా నిర్వహించండి:

వాస్తు ప్రకారం.. దేవతల రాజు ఇంద్రుడు తూర్పు దిక్కును పరిపాలిస్తాడు. కాబట్టి అతనిని సంతోషపెట్టడానికి ఆ దిశను జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. ఈ దిశలో గదులను చక్కగా, శుభ్రంగా, బాగా వెంటిలేషన్, వెలుతురు ఉండేలా చూసుకోవాలి. తద్వారా మీ ఇంట్లో శ్రేయస్సు కలుగుతుంది.

ఫోటోలు వేలాడదీయడానికి చిట్కాలు:

ఇంటి యజమాని, కుటుంబ సభ్యుల ఫోటోలను వారి పేరుతో ఇంట్లో ఉంచడం వలన వారు ప్రసిద్ధులు, ధనవంతులు అవుతారు. ఈశాన్య దిక్కున ఉండే గోడకు ఇవి పెట్టుకోవచ్చు. ఇక నైరుతి మూలలో ఉన్న దక్షిణ గోడపై మరణించిన వారి, పూర్వీకుల ఫోటోలు పెట్టొచ్చు.

నైరుతి దిక్కు నుంచి ప్రవేశం వద్దు:

మీ ఇంటి ముందు ద్వారం నైరుతిలో పెట్టవద్దు. సూర్యుని యొక్క బలమైన పరారుణ కిరణాలు ఈ దిశ నుండి వెలువడతాయి. ఈ దిక్కు
అగ్ని దేవుడు చే పాలించ బడుతుంది. ఈ వైపు ఇంటి ప్రవేశ ద్వారం ఉంటే ప్రతికూల శక్తులు ఇంట్లోకి వచ్చి మీ ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. మీకు అపవాదులను తెస్తాయి.

ఉత్తరాన పచ్చని  మొక్కల పెంపకం:

కుటుంబ సంబంధాలను బలోపేతం చేయడానికి ఆకుపచ్చ మొక్కలు అద్భుతమైనవి. ఇంటి ఉత్తరం వైపు పచ్చని మొక్కలు నాటడం మంచిది.ఇది కుటుంబ ప్రేమ, విశ్వాసాన్ని పెంపొందించడానికి దోహద పడుతుంది.

Also Read:  Johnny Lever : హీరోలకు కూడా నా సీన్స్ అంటే వణుకు. జానీ లీవర్ ఎందుకలా అన్నాడు?