Site icon HashtagU Telugu

Medaram Jatara:ఇక పై మేడారం జాతరకు హెలికాప్టర్ సేవలు

Helicopter Services From Medaram Jatara

Helicopter Services From Medaram Jatara

 

Helicopter-Ride-For-Medaram-Jatara : ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర(sammakka saralamma jatara) ప్రారంభమైంది. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా.. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అమ్మలకు మొక్కలు చెల్లించుకునేందుకు లక్షలాదిగా తరలివస్తున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి జాతర కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ఇక ప్రైవేటు వాహనాల్లో వెళ్లేవారు సరేసరి.

ఈసారి కూడా మేడారం భక్తులకు హెలికాప్టర్ సేవలు(Helicopter services)అందుబాటులోకి వచ్చాయి. ఈ నెల 21 నుంచి 25 వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. మేడారం భక్తుల కోసం పర్యాటకశాఖ గతంలో హెలికాప్టర్ సేవలు అందించిన సంస్థతోనే ఒప్పందం కుదుర్చుకుంది. ధరల వివరాల ఒకటి రెండు రోజుల్లో ప్రకటిస్తారు. హనుమకొండ(Hanumakonda)నుంచి హెలికాప్టర్ సేవలు అందుబాటులో ఉంటాయి. ఇలా వెళ్లినవారికి ప్రత్యేక దర్శనం ఉంటుంది. మొక్కులు చెల్లించిన తర్వాత తిరుగు ప్రయాణం ఉంటుంది. అలాగే, ప్రత్యేకంగా హెలికాప్టర్ జాయ్‌రైడ్ కూడా ఉంటుంది. జాతర పరిసరాలను విహంగ వీక్షణం చేయచ్చు!

We’re now on WhatsApp. Click to Join.

కాగా, మేడారం జాతర బుధవారం నుంచి ప్రారంభంమైంది. మండమెలిగే పండగ పేరుతో నిర్వహించే ఉత్సవంతో జాతర ప్రారంభమైనట్లుగా పూజారులు భావిస్తారు. ఈ ఆదివాసీ వేడుక బుధవారం ఉదయం నుంచి గురువారం వేకువజాము వరకూ జరుగుతుంది. మేడారంలోని సమ్మక్క దేవత పూజామందిరం, కన్నెపల్లి సారలమ్మగుడి, పూనుగొండ్ల, కొండాయి గ్రామాల్లో పగిడిద్ద రాజు, గోవిందరాజు ఆలయాల్లో ఈ ఉత్సవాలు జరుగుతాయి.

పూర్వకాలంలో ఈ ఆలయాల స్థానంలో గుడిసెలు ఉండేవి. రెండేళ్లకు ఇవి పాతబడి పోవడంతో పూజారులు అడవికి వెళ్లి మండలు (చెట్టుకొమ్మలు), వాసాలు, గడ్డి తీసుకొచ్చి కొత్త గుడి నిర్మించి పండగ జరుపుకునేవారు. దీనినే మండమెలిగే పండగ అంటారు. ఇందులో భాగంగా పూజారులు పగలంతా తలో పని చేసి, రాత్రంతా దేవతల గద్దెలపై జాగారం చేస్తారు.

read also : Rashmika : ఫోర్బ్స్ జాబితాలో రష్మిక..విజయ్ ఆనందం అంత ఇంతకాదు..