Site icon HashtagU Telugu

Rudraksha Benefits: రుద్రాక్షలను ధరించడం వల్ల కలిగే లాభాలు గురించి తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే?

Mixcollage 29 Jan 2024 07 59 Pm 5938

Mixcollage 29 Jan 2024 07 59 Pm 5938

మామూలుగా హిందువులు మెడలో రుద్రాక్షలను ధరిస్తూ ఉంటారు. కొందరు ఒక రుద్రాక్షను మాత్రమే ధరిస్తే ఇంకొందరు ఏకంగా రుద్రాక్షల మాలనే ధరిస్తూ ఉంటారు. ఈ రుద్రాక్షలను శివునికి సంబంధించినవిగా భావిస్తారు. రుద్రాక్షి ధరించడం వల్ల ఆధ్యాత్మిక మెలకువ వస్తుంది. ఈ రుద్రాక్ష పూసలు మన ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతాయి. మరి రుద్రాక్ష ధరించడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. రుద్రాక్ష పూసలు ధరించడం వల్ల ప్రశాంతని పొందుతారు. దీని వల్ల ఆందోళన, ఒత్తిడి వంటి సమస్యలు తగ్గుతాయి. అంతేకాకుండా ఈ పూసలు ఏకాగ్రతను పెంచడంలో సహాయపడుతాయి.

రుద్రాక్ష పూసలను లెక్కిస్తూ మంత్రాలను చదవడం వల్ల ఏకాగ్రతను పెంచుతుంది. కోపం, ఒత్తిడి, తగ్గించడంలో కూడా ఈ పూసలు ఎంతో మేలు చేస్తాయి. అంతేకాకుండా సానుకూల మార్గంలో నడిపించడంలో ఉపయోగపడుతాయి. ప్రశాంత కోసం ఈ మాలను ధరించడం వల్ల ఎంతో మేలు కలుగుతుంది. అంతేకాకుండా వేదాల్లో రుద్రాక్షకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇది పాజిటివ్‌గా ఉంచుతుంది. నెగిటివ్‌ను దగ్గరికీ రాకుండా కాపాడుతుంది.రుద్రాక్ష దండ ధరించిన వారు చన్నీటితో స్నానం చేస్తూ ఈ మాల మీద కేవలం నీరు పడేలా చేయడం వల్ల ఎంతో మంచిది. రుద్రాక్ష దండ కవచంలా మిమ్మల్ని రక్షిస్తుంది. మనం తినబోయే ఆహారం లేదా నీరు స్వచ్ఛమైనదా కాదా అని గుర్తించడంలో రుద్రాక్ష పూస కూడా సహాయపడుతుంది.

ఏకముఖి రుద్రాక్ష చాలా శక్తివంతమైనది. దీని ధరించినవారిలో ఒంటరితనం భావాలను సృష్టిస్తుంది. పంచముఖి రుద్రాక్ష సురక్షితమైనది. ప్రశాంతతను తీసుకురావడానికి ప్రసిద్ధి చెందిన ఈ రుద్రాక్ష రక్తపోటును తగ్గిస్తుంది. అలాగే నాడీ వ్యవస్థను శాంతపరుస్తుంది. పిల్లలకు, రుద్రాక్ష పూస వారి దృష్టిని ఏకాగ్రతను పెంచుతుంది. చర్మ సంబంధిత రుగ్మతల నుండి ఉపశమనం పొందడంలో కూడా పూస చాలా ప్రభావవంతంగా ఉంటుంది. గాయాలు వంటి సమస్యలను పరిష్కరించడంలో ఎంతో ఉపయోగపడుతుంది. మార్కెట్లో దొరికే రుద్రాక్షలు అన్నీ నకిలీవే. అసలైన రుద్రాక్షలను పొందడం ఎంతో కష్టం. కాబట్టి మీరు రుద్రాక్షలను కొనుగోలు చేసే ముందు జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి..