Site icon HashtagU Telugu

Ayyappa Deeksha : అయ్యప్పదీక్షలో అనేక ఆరోగ్య రహస్యాలు.. మీకు తెలుసా !

ayyappa deeksha health benefits

ayyappa deeksha health benefits

Ayyappa Deeksha : కార్తీక మాసం వచ్చేసింది. ఈ నెలంతా ఆ ఈశ్వరుడి భక్తులు.. పూర్తి నిష్టగా పూజలు చేస్తారు. అలాగే అయ్యప్పభక్తులు స్వామివారి మాలలను ధరించి దీక్షను స్వీకరిస్తారు. ఏడాదికాలంలో ప్రత్యేకంగా కార్తీక మాసంలో అయ్యప్ప దీక్ష చేపట్టడం వెనుక ఆరోగ్యరహస్యాలున్నాయని చెబుతున్నారు పెద్దలు. కఠిన నియమ, నిష్టలతో అయ్యప్ప దీక్ష చేపట్టిన భక్తులకు ఆధ్యాత్మిక, ఆరోగ్య పరమైన ప్రయోజనాలను అందిస్తుందని చెబుతున్నారు. ఇంతకీ ఆ ఆరోగ్య రహస్యాలేంటో తెలుసుకుందాం.

మాలధారణ చేసిన భక్తులైనా, కార్తీకమాసం పూజలు చేసే వారైనా.. ప్రత్యేకంగా ప్రతిరోజూ ఉదయాన్నే చన్నీటితో తలస్నానం చేస్తారు. దీనివలన మనలోని ప్రతికూల ఆలోచనలు పోయి.. దైవంపై ఏకాగ్రత పెరుగుతుంది.

దీక్ష చేసినన్నిరోజులూ ఆహారాన్ని చాలా మితంగా తీసుకుంటారు. మసాలాలతో కూడిన వంటలకు దూరంగా ఉంటారు. దీనివల్ల శరీరంలో పేరుకున్న కొవ్వు కరిగిపోతుంది. ఫలితంగా శరీరం తేలికపడి.. మరింత ఉత్సాహంగా పనిచేస్తారు.

అయ్యప్పదీక్షాకాలంలో నల్లటి వస్త్రాలు ధరిస్తారు. దీనివల్ల వారిపై శనిప్రభావం పడదు. అలాగే నలుగు రంగు మనోవికారాలను, భౌతిక ఆకర్షణలను దూరంచేసి ఇహపర సఖాలను త్యజిస్తుంది. అలాగే ఉష్ణాన్ని గ్రహించి.. శరీర ఉష్ణోగ్రతను సమంగా ఉంచుతాయి.

భూమిమీద పడుకోవడం వల్ల శరీరానికి సమతుల్యత చేకూరుతుంది. అలాగే అన్ని సుఖాలను త్యజించగలిగే శక్తి మనిషికి వస్తుంది.

ఈ దీక్షాకాలంలో చెప్పులు వాడరు. దీనివల్ల రాళ్లు, రప్పలతో ఉండే శబరికొండపై సులభంగా ముందుకు సాగుతారు. ఒట్టికాళ్లతో నడవడం వలన రక్తప్రసరణ జరిగి.. హృదయ స్పందనలలో సమతుల్యత సాధ్యమవుతుంది.

మన నుదురు దైవస్థానం అంటారు. కనుబొమ్మల మధ్య ఉండే నుదుటి భాగం.. యోగరీత్యా విశిష్టమైనది. దీక్ష సమయంలో ఈ భాగంగా ధరించే కుంకుమ, విభూది, గంధం, చందనాల వల్ల నాడీ మండలం చైతన్యమవుతుంది.

ప్రతిరోజూ ఖచ్చితమైన సమయానికి నిద్రలేవడం, నిద్రించడం వల్ల శరీరంలోని జీవక్రియలన్నీ క్రమబద్ధంగా మారుతాయి. నిద్రపరమైన సమస్యలు కూడా దూరమవుతాయని వైద్యులు చెబుతున్నారు.

సమయపాలన: రోజూ ఖచ్చితమైన సమయానికి లేవటం, నిద్రించటం వల్ల శరీరంలోని జీవక్రియలు క్రమబద్ధంగా మారతాయని, నిద్ర పరమైన సమస్యలూ దూరమవుతాయని వైద్యులు చెబుతున్నారు.

Also Read :