మామూలుగా మనం నిద్రపోతున్నప్పుడు రకరకాల కలలు రావడం అన్నది సహజం. కొన్ని మంచి కలలు వస్తే మరి కొన్ని చెడ్డ కలలు మరికొన్ని పీడకలలు కూడా వస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు చాలామంది భయపడుతూ ఉంటారు. అలాగే కలలో మనకు రకరకాల జంతువులు పక్షులు సరిసృపాలు వంటివి కూడా కనిపిస్తూ ఉంటాయి. అయితే ఎప్పుడైనా మీకు కలలో ఆవు కనిపించిందా..
మరి ఆవు కలలో కనిపిస్తే ఏం జరుగుతుంది ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అది దేనికి సంకేతమో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. హిందూ మతంలో గోమాతను తల్లిగా భావిస్తారు. గోవులో 33 కోట్ల మంది దేవతలు నివసిస్తారని నమ్మకం. అందుకే జంతువులలో ఆవు అత్యంత పవిత్రమైనదిగా చెబుతారు. అంది కాకుండా ఆవును లక్ష్మీదేవి స్వరూపంగా కూడా భావిస్తారు. అయితే స్వప్న శాస్త్ర ప్రకారం కలలో ఆవును చూడడం మంచిదేనట. ఇలా కలలో ఆవు కనిపించడం అన్నది భవిష్యత్తులో ఆనందాన్ని పొందబోతున్నారడానికి అర్థం అని చెబుతున్నారు. అలాగే సమాజంలో కుటుంబ గౌరవం పెరుగుతుందని వ్యాపారంలో పురోగతి లభిస్తుందని చెబుతారు.
కలలో ఆవు దూడను చూడడం కూడా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. రాబోయే రోజుల్లో మీరు ఆర్థికంగా లాభపడే అవకాశం ఉందని అర్థం. మీరు ఏ పనిచేసినా అందులో విజయం సాధిస్తారని చెప్పవచ్చు. కాగా కలలో ఆవుకి రొట్టెలు తినిపిస్తున్నట్లు కల వస్తే అది చాలా మంచిదట. ఈ కల మీకు దీర్ఘాయువును సూచిస్తుందట. చాలా కాలంగా మీ ఆరోగ్యం లేదా మీ కుటుంబంలోని ఎవరికైనా ఆరోగ్యం క్షీణిస్తూ ఉంటే అది త్వరలోనే మెరుగుపడుతుందని అర్థం. కలలో ఆవుల మందను చూడటం అంటే త్వరలో మీకు చాలా డబ్బు లభిస్తుందని అర్థం. వ్యాపారం అభివృద్ధి లోకి వస్తుందని సూచిస్తుందట. అలాగే త్వరలో మీరు ధనవంతులు అవుతారనడానికి సంకేతం అని చెబుతున్నారు. ఒకవేళ కలలో మీరు ఆవు చనిపోయినట్లు చూస్తే మంచిది కాదట. భవిష్యత్ లో కొంత నష్టాన్ని చూడబోతున్నారని అర్థం. కొత్త సమస్యలు రాబోతున్నట్లు సంకేతంగా భావించాలని పండితులు చెబుతున్నారు..