God Is Real : దేవుడు ఉన్నాడా ? లేడా ? అనే టాపిక్‌పై నిత్యం ఆస్తికులు, నాస్తికుల మధ్య డిబేట్ జరుగుతుంటుంది. ఎవరి వాదన ఎలా ఉన్నా.. ‘‘దేవుడు ఉన్నాడు’’ అని హార్వర్డ్ యూనివర్సిటీ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త డాక్టర్ విల్లీ సూన్ ప్రకటించారు. దేవుడు ఉన్నాడని గణిత ఫార్ములాతోనూ నిరూపించవచ్చని ఆయన తెలిపారు. భూమిపై జీవం పుట్టుకకు వాతావరణం అనుకూలించడం అనేది దానంతట అదే జరగలేదని, దీని వెనుక దేవుడు ఉన్నాడని డాక్టర్ విల్లీ సూన్ వివరించారు. విశ్వం పుట్టుక వెనుక దేవుడి సంకల్పం ఉందని, దీనికి నిదర్శనమే ‘యాంటీమ్యాటర్’ అని ఆయన పేర్కొన్నారు. జీవుల మనుగడకు అనుకూలంగా ఉండేలా విశ్వాన్ని దేవుడు తయారు చేశాడన్నారు.
Also Read :Pakistan Train Hijack: రైలు హైజాక్.. 155 మంది రెస్క్యూ.. 20 మంది ప్రయాణికులు, 30 మంది భద్రతా సిబ్బంది మృతి
బిగ్ బ్యాంగ్ తర్వాత దేవుడే..
‘‘బిగ్ బ్యాంగ్(God Is Real) థియరీ మనకు తెలుసు. ఆ మహా పేలుడు వల్లే భూమి పుట్టిందని అంటారు. బిగ్ బ్యాంగ్ జరిగినప్పుడే మ్యాటర్, యాంటీ మ్యాటర్ రెండూ పుట్టాయి. మ్యాటర్ కంటే యాంటీ మ్యాటర్ తక్కువ మోతాదులో ఏర్పడింది. దీనివల్లే జీవం పుట్టుకకు మార్గం సుగమం అయింది. మ్యాటర్, యాంటీ మ్యాటర్ సమాన మోతాదుల్లో ఉంటే, ఒకదాన్ని మరొకటి రద్దు చేసుకొని ఉండేవి. మ్యాటర్ ఎక్కువగా ఉండి, యాంటీ మ్యాటర్ తక్కువగా ఉండటానికి కారకుడు దేవుడే అనిపిస్తోంది’’ అని సూన్ వివరించారు.
Also Read :Usha Vance : భారత్‌కు జేడీ వాన్స్.. తెలుగు రాష్ట్రాల్లో ఉషా వాన్స్ పర్యటిస్తారా ?
యాంటీ మ్యాటర్ పరిశోధనలు
- యాంటీ మ్యాటర్ ఉనికిని తొలిసారిగా 1932లో గుర్తించారు.
- అయితే 1932 కంటే ముందే.. యాంటీ మ్యాటర్ ఉనికిని కేంబ్రిడ్జి యూనివర్సిటీ ప్రొఫెసర్ పాల్ డిరాక్ గుర్తించారు.
- ఫాదర్ ఆఫ్ యాంటీ మ్యాటర్‌గా ప్రొఫెసర్ పాల్ డిరాక్‌కు పేరొచ్చింది.
- దేవుడిని గొప్ప గణితవేత్తగా అభివర్ణిస్తూ డిరాక్ 1963 సంవత్సరంలోనే సైన్ పత్రికల్లో వ్యాసాలు రాశారు.