కనుమ పండుగ శుభాకాంక్షలు… మీ స్నేహితులకు, బంధువులకు ఇలా స్పెషల్ కోట్స్, విషెస్‌తో చెప్పేయండి!

Happy Kanuma తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ సంబరాలు వేడుకగా జరుగుతున్నాయి. ముచ్చటగా మూడు రోజులు జరుపుకునే ఈ వేడుకలో తొలిరోజు భోగి పండుగ. ఈ రోజున భోగి మంటల వెచ్చటి వెలుగులతో ఇంద్రుడిని పూజిస్తారు. ఇక రెండో రోజు మకర సంక్రాంతి పండుగ రోజున సంక్రాంతి కాంతులతో సిరిసంపదలు, సౌభాగ్యాలతో ప్రతీ ఇల్లూ శోభాయమానంగా వెలుగొందాలని సూర్యభగవానుడిని వేడుకుంటారు. ఇక మూడో రోజు కనుమ పండుగ (Kanuma Festival 2026). పశుసంపదను పూజించి పాడిపంటలతో సుభిక్షంగా […]

Published By: HashtagU Telugu Desk
Happy Kanuma

Happy Kanuma

Happy Kanuma తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ సంబరాలు వేడుకగా జరుగుతున్నాయి. ముచ్చటగా మూడు రోజులు జరుపుకునే ఈ వేడుకలో తొలిరోజు భోగి పండుగ. ఈ రోజున భోగి మంటల వెచ్చటి వెలుగులతో ఇంద్రుడిని పూజిస్తారు. ఇక రెండో రోజు మకర సంక్రాంతి పండుగ రోజున సంక్రాంతి కాంతులతో సిరిసంపదలు, సౌభాగ్యాలతో ప్రతీ ఇల్లూ శోభాయమానంగా వెలుగొందాలని సూర్యభగవానుడిని వేడుకుంటారు. ఇక మూడో రోజు కనుమ పండుగ (Kanuma Festival 2026). పశుసంపదను పూజించి పాడిపంటలతో సుభిక్షంగా కళకళలాడాలని ఆకాంక్షిస్తారు.

 సంక్రాంతి సంబరాల్లో మూడు రోజున జరుపుకునే కనుమ పండుగను (Kanuma 2026) పశువుల పండుగగా వ్యవహరిస్తారు. రైతులు ఆరుకాలం కష్టపడి పండించిన పంటలు చేతికి అందే సమయం. ఈ ప్రక్రియలో తమకు సహాయపడిన పశుపక్షాదులను పూజిస్తారు. ప్రతిరోజూ తమతో పాటు కష్టపడిన ఆవులను, ఎద్దులను, గేదెలను పూజించి ఆరాధించే రోజు ఇదే. కేవలం పశువులే కాదు పక్షులు కూడా రైతన్నకు నేస్తాలే. అందుకే పక్షుల కోసమే అన్నట్లు ఇంటి గుమ్మానికి ధాన్యపు కంకులు వేలాడదీస్తారు. రైతులను రాజుగా మార్చే విశిష్టమైన కనుమ పండుగ శుభాకాంక్షలు 2026 సైతం అంతే విశిష్టంగా ఉండాలి కదా! అదెలాగో ఇప్పుడు చూద్దాం

రైతును రాజుగా మార్చే పండుగ
పంట చేలు వరికోతలతో ఇచ్చే కానుక
కమ్మనైన వంటలతో కడుపు నింపే వేడుక
మీకు మీ కుటుంబ సభ్యులకు కనుమ పండుగ శుభాకాంక్షలు 2026

అన్నదాతల కష్టానికి తగిన ప్రతిఫలం ఈ కనుమ
శ్రమకోర్చిన పశుపక్షాదులకు అందించే గౌరవం ఈ కనుమ
అందరూ కలిసిమెలిసి కష్టసుఖాలు పంచుకునే పర్వదినం ఈ కనుమ
మీకు మీ కుటుంబ సభ్యులకు కనుమ పండుగ శుభాకాంక్షలు 2026

మట్టిలో పుట్టే మేలిమి బంగారం
కష్టం చేతికి అందివచ్చే తరుణం
నేలతల్లి పాడిపశువులు అందించిన వర ప్రసాదం
కనుమ రూపంలో వడ్డించింది పరమాన్నం
కనుమ పండుగ శుభాకాంక్షలు 2026

అన్నదాతల కష్టానికి ప్రతిఫలం కనుమ
శ్రమకోర్చిన పశువులకు గౌరవం కనుమ
అందరం కలిసి కష్టసుఖాలు పంచుకునే పర్వదినం
మీకు మీ కుటుంబ సభ్యులకు కనుమ పండుగ శుభాకాంక్షలు 2026

కమ్మని విందు భోజనానికి
కమనీయ జీవితానికి
నాంది ఈ కనుమ పండగ
కనుమలోని కమ్మదనం మీ జీవితంలో కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
మీకు మీ కుటుంబ సభ్యులకు కనుమ పండుగ శుభాకాంక్షలు 2026

కనుమలోని కమనీయం
మీ జీవితాన్ని రమణీయంగా మార్చాలని కోరుకుంటూ
మీకు మీ కుటుంబ సభ్యులకు కనుమ శుభాకాంక్షలు 2026

మీ ఇల్లు ధాన్యరాశులతో నిండుగా
పాడి పంట‌ల‌తో పచ్చగా
ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ
మీకు మీ కుటుంబ సభ్యులకు కనుమ శుభాకాంక్షలు 2026

  Last Updated: 16 Jan 2026, 10:26 AM IST