భారతదేశంలో హిందువులు ఎక్కువగా కొలిచే దేవుళ్ళలో ఆంజనేయ స్వామి కూడా ఒకరు. వాయుపుత్రుడికి రకరకాల పూజలు చేస్తారు. వాటిలో ఒకటి తమలపాకులతో పూజ. ప్రతి మంగళ శనివారాలలో ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఆంజనేయ స్వామికి ఇష్టమైన వాటిలో తమలపాకులు కూడా ఒకటి. తమలపాకులతో భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల కోరిన కోరికలు నెరవేర్చడంతో పాటు కొండంత అండగా నిలుస్తాడు ఆంజనేయస్వామి.
మరి తమలపాకులతో ఆంజనేయస్వామిని పూజించడం వల్ల ఎటువంటి ఫలితాలు కనిపిస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. తరచూ ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు తమలపాకులతో ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు. అలాగే మంత్ర సంబంధమైన పీడలు తొలగిపోతాయి. స్వామికి తమలపాకుల హారాన్ని వేయిస్తే సంసారంలో కలతలు తొలగిపోతాయి. అనారోగ్యం బారిన పడిన పిల్లల పేరుమీద వాయుపత్రుడికి తమలపాకు మాల వేయడం వల్ల ఆ పిల్లలు త్వరగా కోలుకుంటారు.
అదేవిధంగా వ్యాపారాల్లో నష్టాలు వచ్చి ఇబ్బందులు పడేవారు తమలపాకులతో పూజించడం వల్ల వాటి నుంచి బయటపడతారు. శని దోషం వెంటాడుతున్నవారు తమలపాకు మాల సమర్పిస్తే శనీశ్వరుడి ప్రభావం తగ్గుతుంది. సుందర కాండ పారాయణం చేసి స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే అన్ని కార్యాల్లో విజయం సిద్ధిస్తుంది
కోర్టు వివాదాలను ఎదుర్కొంటున్నవారు స్వామికి తమలపాకుల హారాన్ని వేసి ఆ ఆకులను ప్రసాదంగా తింటే జయం పొందుతారు.