Site icon HashtagU Telugu

Mangalvar Pooja: మంగళవారం ఆంజనేయస్వామిని ఈ విధంగా పూజిస్తే చాలు.. డబ్బే డబ్బు?

Mangalvar Pooja

Mangalvar Pooja

భారతదేశంలో హిందువులు ఒక్కొక్క రోజు ఒక్కో దేవుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. అయితే హిందువులు ఎక్కువగా ఆరాధించే దేవతలలో ఆంజనేయ స్వామి కూడా ఒకరు. హనుమంతుడు తన భక్తులను త్వరగా అనుగ్రహించడంతోపాటు కోరిన కోరికను కూడా నెరవేరుస్తాడు. అందుకే చాలామంది మంగళవారం రోజున ఆంజనేయ స్వామిని భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. మరి కొంతమంది శనివారం రోజు ఆంజనేయ స్వామిని పూజిస్తూ ఉంటారు. మంగళవారం ఆంజనేయ స్వామికి అంకితం చేయబడిందని చెప్పవచ్చు. అయితే మామూలు మంగళవారాలతో పాటు జ్యేష్ట మాసంలో వచ్చే మంగళవారంలో ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల మరిన్ని మంచి ఫలితాలు కలుగుతాయి.

హనుమంతుని మంగళవారం రోజున భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల మనకు ఏవైనా గ్రహదోషాలు ఉంటే అవి తొలగిపోవడంతో పాటు అనుమంతుడు మనకు కావాల్సినంత ధైర్యాన్ని ఇస్తాడు. మంగళవారం రోజున హనుమంతుని పూజిస్తే సకల గుణాలు సిద్ధిస్తాయని ప్రతీతి. అనగా మానవులకు సహజ సిద్ధంగా ఉండే త్రిగుణాలు సత్వ, రజో, తమో గుణాలు. ఇందులో తమో, రజో గుణం మానవున్ని అథ: పాతాళానికి నెట్టేస్తోంది. మామూలు మంగళవారాలతో పాటుగా జేష్ట మంగళవారం రోజున ఆంజనేయస్వామిని భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల మరిన్ని ఎక్కువ ఫలితాలు కలుగుతాయి.

జేష్ఠ మాసంలో వచ్చే మంగళవారాల్లో హనుమంతున్ని పూజించడం వల్ల మనకు గల అనేక దోషాలు తొలుగుతాయి. మంగళవారం రోజున ఉదయమే అనగా సూర్యోదయం కాకముందే నిద్ర లేచి తలంటు స్నానం చేసి ఆంజనేయ స్వామి భక్తిశ్రద్ధలతో పూజించడంతోపాటు ఆ రోజున ఉపవాసం ఉంటే మరిన్ని మంచి ఫలితాలు కలుగుతాయి. అతడు ఒక దగ్గరలో ఉన్నావా ఆంజనేయస్వామి గుడిని దర్శించి హనుమాన్ చాలీసా పఠించడంతో పాటుగా ఆంజనేయ స్వామి దండకం పట్టించడం వల్ల విశేష పుణ్యఫలం దక్కుతుంది. హనుమాన్ సింధూరంతో పాటు కాషాయం లేదా ఎరుపు రంగు దుస్తులు ధరించడం వలన కుజ దోషం తొలిగి పెళ్లి కానీ పిల్లలకు త్వరగా పెళ్లి అవుతుంది.