Hanuman Sindoor: హనుమంతుడు సింధూరం ధరించడం వెనుక ఉన్న ఆంతర్యం ఇదే?

భారతదేశంలో హిందువులు ఎక్కువగా పోషించే దేవుళ్ళలో హనుమంతుడు కూడా ఒకరు. హనుమంతుడిని భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల భక్తులకు ధైర్యాన్ని ఇవ్వడంతో

Published By: HashtagU Telugu Desk
Hanuman Sindoor

Hanuman Sindoor

భారతదేశంలో హిందువులు ఎక్కువగా పోషించే దేవుళ్ళలో హనుమంతుడు కూడా ఒకరు. హనుమంతుడిని భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల భక్తులకు ధైర్యాన్ని ఇవ్వడంతో పాటు కష్టాలను గట్టెక్కిస్తాడని నమ్మకం. హనుమంతుడికి ఇష్టమైన వాటిలో తమలపాకులు అలాగే సింధూరం కూడా ఒకటి. హనుమాన్ ని పూజించేందుకు సింధూరాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. కేసరి రంగులో ఉండే సింధూరం సమర్పించడం ద్వారా సకల కోరికలు నెరవేరుతాయట. సింధూరంతో హనుమంతుని ఆరాధించిన వారికి తప్పక ఫ్రతిఫలం దక్కుతుంది.

సిందూరంతో చేసిన హనుమాన్ పూజ ఆయనను ప్రసన్నుడను చేస్తుంది. ఇలా సింధూరానికి హనుమంతుడికి విడదీయలేని సంబంధం ఉంది. సింధూర ధారణతో హనుమంతుడు కరుణించడంతో కోరిన కోరికలు తీరుస్తాడు. ముఖ్యంగా మంగళవారం రోజు ఆంజనేయుడికి సింధూర పూజ చేస్తే ఇంట్లోకి సౌభాగ్యం వస్తుంది. సుఖ శాంతులు వెల్లివిరుస్తాయి. హనుమంతుడికి సింధూర సేవను ఆలయాల్లో ప్రత్యేకంగా నిర్వహిస్తారు.

ఆయనకు ఎంతో ఇష్టమైన సింధూరం సమర్పణలో పాలుపంచుకున్న వారి సకల అభీష్టాలు నెరవేరుతాయి. కేవలం సింధూరం మాత్రమే కాకుండా ఆంజనేయ స్వామికి తమలపాకులు అంటే కూడా ఎంతో ఇష్టం. తమలపాకులతో హారం కట్టి శనివారం రోజు ఆంజనేయ స్వామికి బీసీ భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల అనుకున్న కోరికలు నెరవేయడంతో పాటు కష్టాలనుంచి ఘట్టెక్కిస్తాడు. ప్రతి శనివారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్లి ఆయనను భక్తిశ్రద్ధలతో ఆరాధించడం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి.  హనుమంతుడికి సింధూరం సమర్పించడం వెనుక ఒక పౌరాణిక కథ ప్రాచూర్యంలో ఉంది.హనుమంతుడు సీతను వెతుకుతూ లంకకు వెళ్లిన సందర్భంలో అశోక వనంలో సీతను కనిపెట్టిన తర్వాత దూరం నుంచే సీతాదేవిని చాలా సమయం పాటు గమనిస్తూ ఉంటాడు. ఆమె ప్రతిరోజూ, అనునిత్యం తన పాపిటలో సింధూరం ధరించడాన్ని గమనిస్తాడు. రావణుడు రావడం సీతను బెదిరించడం వంటి అన్ని ఘట్టాల తర్వాత తనను తాను రామబంటుగా సీతకు పరిచయం చేసుకుంటాడు హనుమంతుడు.

ఆ సందర్భంలో సీతాదేవిని సింధూరం గురించి అడుగుతాడు. అప్పుడు ఆమె శ్రీరామచంద్రుడి దీర్ఘాయువు కోసం తాను ఈ సింధూరాన్ని తన నుదుటన ధరిస్తానని, అంతే కాదు ఇది ఆయనకు చాలా ఇష్టమని, దీన్ని ధరించిన తన ముఖాన్ని చూసిన శ్రీరాముడి ముఖంలో ప్రసన్నతను తాను గమనించగలుగుతానని అందుకే.. ఆయనకు నచ్చే విధంగా ఉండేందుకు గాను తాను సింధూరాన్ని ప్రతి నిత్యం ధరిస్తానని సమాధానం చెప్పిందట. కాస్త సింధూరం రాముడికి దీర్ఘాయువును ఇస్తే తాను తనువంతా సింధూరం ధరిస్తే రాముడికి మృత్యువే ఉండదు. చిటికెడు సింధూరం నుదుటన ధరించిన సీతనే అంత శ్రీరాముడు అంత ప్రేమిస్తే, తనను ఇంకెంత ప్రేమిస్తాడో కదా అని అప్పటి నుంచి హనుమంతుడు ఒళ్లంతా సింధూరం ధరిస్తాడని ఒక కథ ప్రాచూర్యంలో ఉంది.

  Last Updated: 22 Jun 2023, 07:29 PM IST