Site icon HashtagU Telugu

Hanuman: తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు

Hanuman

Hanuman

Hanuman: తెలుగు రాష్ట్రాల్లో హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. జయంతి సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున పూజలు జరిగాయి. తెలంగాణలోని ప్రముఖ ఆలయాలైన కొండగట్టు, మద్దిమడుగు క్షేత్రాల్లో భక్తుల సందడి నెలకొంది. చాలా చోట్ల అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి హునుమాన్ భారీ విగ్రహాలను ఊరేగించారు. ఇక అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయాల్లో హనుమాన్ జయంతి ఘనంగా నిర్వహిస్తున్నారు.

ప్రత్యేక అలంకరణలతో దేవాలయాల్ని ముస్తాబు చేసి హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. గుంతకల్లు మండలం కసాపురం గ్రామంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవస్థానంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జయంతి వేడుకల్లో భాగంగ స్వామివారికి నేడు తులసిమాల సేవ, పుష్పాలంకరణ, పండుతో అలంకరణ తో పాటు స్వామి వారికి వజ్ర కవచ అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.