Site icon HashtagU Telugu

Hanuman Jayanti: ఆంజనేయస్వామి అనుగ్రహం కలగాలి అంటే హనుమాన్ జయంతి రోజు ఈ విధంగా చేయాల్సిందే!

Hanuman Jayanti

Hanuman Jayanti

హిందువులు ఎక్కువగా పూజించే దేవుళ్ళలో హనుమంతుడు కూడా ఒకరు. రామభక్తుడు అయిన హనుమంతుడిని ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క పేరుతో పిలవడంతో పాటు పూజలు కూడా చేస్తూ ఉంటారు. గ్రామీణ ప్రాంతాలలో ఎలాంటి గుడి ఉన్నా లేకపోయినా తప్పకుండా ఆంజనేయ స్వామి గుడి అయితే ఉంటుంది. ఇకపోతే ప్రతి ఏడాది హనుమాన్ జయంతి వేడుకలను హిందువులు ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. ఈ హనుమాన్ జయంతి రోజున హనుమంతుడిని ప్రత్యేకంగా పూజిస్తూ ఆరాధిస్తూ ఉంటారు. ఇకపోతే ఈ ఏడాది ఏప్రిల్ 12వ తేదీన హనుమాన్ జయంతి వచ్చింది.. ఈ హనుమాన్ జయంతి రోజున కొన్ని రకాల పనులు చేయడం వల్ల తప్పకుండా హనుమంతుడి అనుగ్రహం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. మరి హనుమాన్ జయంతి రోజు ఏం చేస్తే మంచి జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఈ రోజున భక్తులు హనుమంతుడి ఆశీర్వాదం కోసం రామలయాలను, హనుమంతుడి ఆలయాలను సందర్శించడం మంచిది. ఉపవాసం ఉంటే మరిన్ని మంచి ఫలితాలు కలుగుతాయి అని చెబుతున్నారు. అలాగే ఈరోజు హనుమాన్ చాలీసాను జపించడం మంచిది. చైత్ర మాసం పౌర్ణమి తిథి శనివారం, ఏప్రిల్ 12వ తేదీ, 2025 ఉదయం 03:21 గంటలకు ప్రారంభమై, ఆదివారం, ఏప్రిల్ 13వ తేదీ, 2025 ఉదయం 05:51 గంటలకు ముగుస్తుంది. కాబట్టి హనుమంతుడి జయంతిని పౌర్ణమి రోజు ఏప్రిల్ 12వ తేదీన జరుపుకోనున్నారు. ఇకపోతే ఈ రోజున చేయాల్సిన పనుల విషయం కొస్తే.. హనుమాన్ జయంతి రోజున కోతులకు బెల్లం తినిపించడం చాలా మంచిదని చెబుతున్నారు.

అలాగే హనుమాన్ జయంతి రోజున దానం చేయడం శుభప్రదమని నమ్మకం. ఈ రోజున దానం చేయడం వల్ల సమస్యలు తొలగిపోయి, ప్రశాంతమైన జీవితం లభిస్తుందట. హనుమంతుడికి సిందూరం, తమలపాకులు సమర్పించడం శుభప్రదం అని చెబుతున్నారు. కాగా హనుమాన్ జయంతి రోజున ప్రతి ఒక్కరూ బ్రహ్మచర్యాన్ని పాటించాలట. హనుమంతుడిని పూజించేటప్పుడు ఎర్రటి పువ్వులు, దేశీ నెయ్యి లేదా నువ్వుల నూనెను ఉపయోగించాలనీ చెబుతున్నారు. ఈరోజు ఎలాంటి పనులు చేయకూడదు అన్న విషయం వస్తే.. హనుమాన్ జయంతి రోజున తామసిక ఆహారం తినకూడదట. మద్యం సేవించడం నాన్ వెజ్ తినడం వంటివి చేయకూడదని చెబుతున్నారు. జయంతి రోజు ఏ జంతువుకు ఇబ్బంది పెట్టడం హాలి కలిగించే పనులు చేయడం లాంటివి అస్సలు చేయకూడదట. మత్తు పదార్థాలు కూడా ఉపయోగించకూడదట. ఈరోజున ఎవరితోను గొడవలు పడకపోవడమే మంచిదని చెబుతున్నారు. ఇతరులను అవమానించే విధంగా మాట్లాడకూడదట