హనుమంతుడి జన్మదినోత్సవం వేడుకలను ప్రతి సంవత్సరం చైత్ర మాసంలోని శుక్ల పక్ష పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఈ రోజున శ్రీ రాముడు, హనుమంతుడిని పూజించడం వల్ల జీవితంలోని అన్ని కష్టాల నుంచి ఉపశమనం లభిస్తుందని నమ్ముతారు. అంతేకాకుండా కోరిన అన్ని కోరికలు నెరవేరుతాయని నమ్మకం. కాగా హనుమంతుడు చైత్ర మాసం పౌర్ణమి రోజున అంజనీ దేవి, కేసరి దంపతులకు జన్మించాడని నమ్మకం. చైత్ర మాసం పౌర్ణమి తిధిలో నిర్వహిస్తారు. ఈ సంవత్సరం చిత్ర పౌర్ణమి తిధి ఏప్రిల్ 12వ తేదీ తెల్లవారు జామున 3:21 గంటలకు ప్రారంభమవుతుంది.
ఈ తిధి మర్నాడు అంటే ఏప్రిల్ 13న ఉదయం 5:51 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం హనుమాన్ జన్మదినోత్సవాన్ని ఏప్రిల్ 12న జరుపుకుంటారట. హనుమంతుడి జన్మ దినోత్సవం రోజున రామ భక్త హనుమంతుడితో పాటు సీతా రాములను కూడా పూజిస్తారు. ఈ రోజు ఉదయాన్నే నిద్రలేచి, స్నానం చేసి, ఎర్రటి దుస్తులు ధరించాలి. ఆ తరువాత, హనుమంతునికి ప్రసాదంగా సింధూరం, ఎర్రటి పువ్వులు, తులసి దళాలు, శనగలు, బూందీ లడ్డును సమర్పించాలట. అలాగే హనుమంతుడికి సంబంధించిన మంత్రాన్ని జపించాలట.
తరువాత హనుమాన్ చాలీసా, సుందరకాండ పారాయణం చేయాలనీ చెబుతున్నారు. పూజ చివరలో హనుమంతుడికి హారతి ఇచ్చి అందరికీ ప్రసాదం పంచి పెట్టాలట. ఈ రోజున పూజ సమయంలో హనుమంతుడికి ఎరుపు రంగు పువ్వులు, దండలు, సింధూరం, బూందీ లేదా శనగపిండి లడ్డులు, తులసి దళాలు, తమలపాకులను సమర్పించడం ద్వారా హనుమంతుడు సంతోషిస్తాడని పండితులు చెబుతున్నారు. ఈరోజున హనుమంతుడిని ప్రత్యేకంగా భక్తి శ్రద్ధలతో పూజించే వారికీ ఆయన అనుగ్రహం తప్పకుండా లభిస్తుందట..