Site icon HashtagU Telugu

Hanuman Jayanthi 2025: హనుమాన్ జయంతి రోజు అంజన్నను ఈ విధంగా పూజిస్తే చాలు.. అనుగ్రహంతో పాటు శుభ ఫలితాలు కలగడం ఖాయం!

Hanuman Jayanthi 2025 (2)

Hanuman Jayanthi 2025 (2)

హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలు హనుమాన్ జయంతి కూడా ఒకటి. వ్యాప్తంగా ఉన్న హిందువులు ఈ హనుమాన్ జయంతిని ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఈ రోజున హనుమంతుడిని ప్రత్యేకంగా భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఆరాధిస్తూ ఉంటారు. ప్రతి ఏడాది చైతన్య మాసంలోని పౌర్ణమి రోజున ఈ హనుమాన్ జయంతిని జరుపుకుంటూ ఉంటారు. ఈ ఏడాది ఎప్పుడు వచ్చింది? ఆ రోజున ఏం చేయాలి అన్న విషయానికి వస్తే..

ఈ ఏడాది 2025 ఏప్రిల్ 12 అనగా శనివారం రోజు పౌర్ణమి రోజున హనుమాన్ జయంతి వచ్చింది. ఏప్రిల్ 12, 2025 తెల్లవారు జామున 3:21 గంటలకు పౌర్ణమి తిధి ప్రారంభమై ఏప్రిల్ 13, 2025 ఉదయం 5:51 గంటలకు ముగుస్తుంది. హనుమంతుడు శివుని అవతారంగా చెబుతారు. అంజనాదేవి, కేసరి కుమారుడు. త్రేతా యుగంలో అంజనీ మాత గర్భం నుంచి ఆంజనేయుడు జన్మించాడని పండితులు చెబుతారు. కాగా హనుమాన్ జయంతి రోజున హనుమంతుడితో పాటు సీతారాములను కూడా పూజించడం ఆచారం. ఈ విధంగా చేయడం వల్ల హనుమంతుడి అనుగ్రహంతో పాటు ఆ సీతారాముల అనుగ్రహం కూడా తప్పకుండా లభిస్తుంది.

ఏప్రిల్ 12న అనగా హనుమాన్ జయంతి రోజున బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి, శుభ్రంగా స్నానం చేయాలి. ఇక పూజ సమయంలో ఎర్రటి వస్త్రాలను ధరించడం చాలా మంచిది. హనుమంతుడికి సింధూరం, ఎర్రటి పూలు, తులసి దళాలను సమర్పించాలి. అలాగే హనుమాన్ జయంతి రోజు తమలపాకుల దండ లేదంటే వడమాలను సమర్పించడం వల్ల ఆయన మరింత సంతోషిస్తారట. సింధూరం, తమలపాకులతో హనుమంతుడికి అష్టోత్తరం చదువుతూ ప్రత్యేక పూజలు చేయాలని పండితులు చెబుతున్నారు. అలాగే హనుమాన్ చాలీసా సుందరకాండ పారాయణం చేయడం వల్ల మరిన్ని మంచి ఫలితాలు కలుగుతాయి.

చివరగా హనుమంతుడికి హారతి ఇచ్చి, శనగలు, బూందీ లడ్డు, అప్పాలు వంటి ప్రసాదాలను అందరికీ పంచాలట. ఈ విధంగా భక్తిశ్రద్ధలతో హనుమాన్ జయంతిని జరుపుకోవడం వల్ల శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. హనుమాన్ జయంతి నాడు భక్తితో పూజిస్తే కష్టాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే దుష్ట శక్తుల బాధ తొలగిపోతుందట. అలాగే శాంతి, శ్రేయస్సు కలుగుతాయట. అందువల్ల వాయునందనుడి జయంతి రోజున స్వామిని పూజించడం ఎంతో మంచిదని పండితులు చెబుతున్నారు.