Site icon HashtagU Telugu

Hanuman: రాహు గ్రహదోషం ఉండకూడదు అంటే ఆంజనేయుడికి ఇవి సమర్పించాల్సిందే?

Hanuman

Hanuman

హిందువులు భక్తి శ్రద్ధలతో ఎక్కువగా కొలిచే దేవుళ్ళలో హనుమంతుడు కూడా ఒకరు. హనుమంతుడిని భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల బోలెడంత ధైర్యాన్ని ఇవ్వడంతో పాటు కష్టాల నుంచి గట్టెక్కిస్తాడని విశ్వసిస్తూ ఉంటారు. అలాగే భక్తి శ్రద్ధలతో ఆంజనేయుడిని పూజిస్తే గ్రహ దోషాల నుంచి విముక్తి కలుగుతుందంటారు పండితులు. శని సైతం హనుమంతుడి ముందు నిలవలేకపోయాడు. శని దేవునికి సంబంధించిన దోషాలు ఏవైనా ఉన్నా కూడా ఆంజనేయస్వామిని పూజించడం వల్ల తొలగిపోతాయని చెబుతూ ఉంటారు.

అయితే ఇబ్బంది పెట్టే గ్రహాల్లో రాహువు కూడా ఉన్నాడు. జాతకంలో రాహు గ్రహం సరైన స్థానంలో లేకపోయినా, రాహు గ్రహం సంచారం వల్ల జరిగే నష్టాలు అరికట్టాలన్నా వాయుపుత్రుడిని పూజించాల్సిందే అని చెబుతారు. అందుకోసం ఎవరైతే మినుములతో తయారుచేసిన గారెలను మాలగా చేసి హనుమంతునికి సమర్పిస్తారో వారికి రాహుగ్రహం కారణంగా ఏర్పడే దోషాల నుంచి విముక్తులు అవుతారు అని వరం ఇచ్చాడట. వాస్తవానికి రాహు గ్రహ దోష నివారణార్థం మినుములు దానం చేస్తారు.

మరికొందరు వడమాల తయారు చేసి హనుమాన్ కి సమర్పిస్తారు. శనివారానికి అధిపతి శనీశ్వరుడే కాబట్టి శనీశ్వరునికి ఇష్టమైన పదార్థాలను హనుమంతునికి ప్రసాదంగా అందిస్తే అటు ఆంజనేయుడు, ఇటు శనీశ్వరుడూ ఇద్దరూ అనుగ్రహిస్తారు. నల్లటి పదార్థం ఏదైనా శనీశ్వరునికి ఇష్టమే. కాబట్టి పొట్టు మినుములతో చేసిన వడలను స్వామివారికి సమర్పిస్తారు. కాబట్టి ఎవరైనా రాహు గ్రహదోషంతో బాధపడుతుంటే వారు మినుములతో తయారు చేసిన గారెల మాలను ఆంజనేయ స్వామికి సమర్పించాలి.