మాములుగా నరదిష్టి తగలకుండా ఉండడం కోసం, ఇంటికి నిమ్మకాయలు, మిరపకాయలు కట్టుకోవడం లేదంటే ఇంటి ముందు అద్దం ఏర్పాటు చేసుకోవడం వంటి వాటితో పాటుగా బూడిద గుమ్మడికాయను కూడా ఇంటి ముందు దిష్టి తగలకుండా కడుతూ ఉంటారు. అయితే ఇలా బూడిద గుమ్మడికాయను కట్టే విషయంలో కొన్ని రకాల విషయాలను తప్పకుండా పాటించాలి. కొన్ని ప్రత్యేకమైన నియమాలు కూడా ఉన్నాయి. నెగటివ్ ప్రభావం పడకుండా ఉండాలని చాలామంది ఇంటి ముందు బూడిద గుమ్మడికాయను వేలాడతీస్తూ ఉంటారు. ఇలా ఇంటి ముందు బూడిద గుమ్మడి కాయలు వేలాడ తీయడం వల్ల ఆ ఇంటిపై ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఏర్పడకుండా ఉంటుందని భావిస్తారు.
అలాగే నరదృష్టి కూడా ఏర్పడకుండా ఉంటుందని ఈ విధంగా ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. అయితే బూడిద గుమ్మడికాయను ఇంటి ముందు కట్టేటప్పుడు పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదట. ఇంతకీ ఆ తప్పులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఇంటికి కట్టే బూడిద గుమ్మడికాయ సాధారణంగా కొన్ని నెలల వరకు చెడిపోదు. అయితే మనం కట్టిన గుమ్మడికాయ కట్టిన కొద్ది రోజులకే చెడిపోయింది అంటే మన ఇంటిపై నరుల దృష్టి అలాగే నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉందని అర్థం. గుమ్మడికాయ చెడిపోతే దానిని తీసి మరొకటి కట్టాలట. ఇలా కట్టే సమయంలో ఇష్టానుసారంగా కట్టకూడదని కొన్ని పద్ధతులను అనుసరించి నియమాలను పాటించి కట్టాలని చెబుతున్నారు.
ఇంటి ముందు బూడిద గుమ్మడికాయ వేలాడ తీయటానికి ప్రత్యేకమైన పూజలు చేసి దానిని ఇంటి ముందు వేలాడతీయాలట. ఇలా ఇంటి ముందు కానీ దుకాణాల ముందు కానీ బూడిద గుమ్మడి కాయలను వేలాడతీయడం వల్ల నరదృష్టి తగలకుండా ఉంటుందట. బూడిద గుమ్మడికాయకు ఐశ్వర్య కాళీ ఫోటో యంత్రాన్ని జోడించి ఒక శుభ ముహూర్తంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఐశ్వర్య కాళీ ఫోటోతో సహా బూడిద గుమ్మడికాయ వేలాడ తీయడం వల్ల ఆశక్తి మరింత రెట్టింపు అవుతుందని పండితులు చెబుతున్నారు. గుమ్మడికాయను కట్టడం వల్ల ఇది ఇంటి మీద ఇంటి మనుషుల మీద చెడదృష్టి పడకుండా కాపాడుతుందట. ఇంటి ముందుకు వచ్చేటువంటి దోషాలు అంటే నరఘోష, నరపీడ, నరదృష్టి, నకారాత్మక శక్తిని కాలభైరవ స్వరూపమైనటువంటి గుమ్మడికాయ నిరోదిస్తుందని పండితులు చెబుతున్నారు. అలాగే బూడిద గుమ్మడి కాయను ఎప్పుడు పడితే అప్పుడు కట్టకూడదట. కొన్ని ప్రత్యేక నియమాలతో పూజలు చేసి మరీ కట్టాలని చెబుతున్నారు. అలాగే బూడిద గుమ్మడి కాయను శుభ్రం చేసి కట్టకూడదట. పైన తెల్లటి బూడిద అలాగే ఉంచి కట్టాలని చెబుతున్నారు.