Site icon HashtagU Telugu

Guru-Shukra: 700 ఏళ్ల తర్వాత గురు, శుక్ర సంయోగంతో ఈ రాశుల వారు పట్టిందల్లా బంగారమే?

Mixcollage 06 Dec 2023 01 56 Pm 6286

Mixcollage 06 Dec 2023 01 56 Pm 6286

మామూలుగా గ్రహాల ప్రభావం మనుషులపై వారి జీవితాల పై తప్పకుండా ఉంటుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే. గ్రహాల రవాణా ఎంత ముఖ్యమైనదో వాటి సంయోగం కూడా అంతకంటే ముఖ్యమైనది అని చెప్పవచ్చు. ఈ గ్రహాల కలయిక వల్ల విశ్లేషమైన రాజయోగాలు కలుగుతాయి. అలా గురు శుక్ర సంయోగం వల్ల కొన్ని రాశుల వారికి పట్టిందల్లా బంగారం కాబోతోంది. అంతేకాకుండా ఆ రాశుల దశతిరగబోతోంది. మరి ఆ రాశులలో మీ రాశి కూడా ఉందేమో చెక్ చేసుకోండి.. కాగా గ్రహాల సంచారం తర్వాత వాటి కలయిక కూడా ముఖ్యమైనది. ఒక రాశి నుండి మరొక రాశికి మారినప్పుడు, అది మరొక గ్రహంతో కలిసిపోతుంది. ఇది చాలా ప్రత్యేకం. అయితే దాదాపుగా 700 సంవత్సరాల తర్వాత గురు-శుక్ర సంయోగం జరగబోతోంది. ఈ సంయోగం వల్ల కొన్ని రాశుల వారికి రాజయోగం కలుగుతాయి.

మేషం.. ఈ రాశి వారికి మంచి రోజులు ప్రారంభం కాబోతున్నాయి. సమాజంలో హోదా, ప్రతిష్టలు పొందగలరు. అలాగే, ఆర్థిక పెట్టుబడులు మీకు గొప్ప ప్రయోజనాలను అందిస్తాయి.

కన్య.. ఈ రాశి వారికి రాజయోగాల వల్ల విదేశాలకు వెళ్లే అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా ఈ సమయంలో ఈ రాజయోగాల వల్ల ఉద్యోగులకు పదోన్నతి కూడా లభిస్తుంది.

ధనస్సు రాశి.. ఈ రాశి వారికి కూడా వృత్తిలో అభివృద్ధి బాగా ఉంటుంది. ముఖ్యంగా వీరు పదోన్నతి పొందవచ్చు. అలాగే ఈ ధనస్సు రాశి వారి యొక్క వైవాహిక జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. మీరు ఊహించని ఆర్థిక ప్రయోజనాలను కూడా పొందవచ్చు.

మకరం.. ఈ రాశి వ్యక్తులు జీవితంలోని అనేక రంగాలలో మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంది. ఈ సమయంలో నిరుద్యోగులకు అనేక అవకాశాలు లభిస్తాయి. మంచి కంపెనీ నుంచి ఆఫర్ లు వస్తాయి. అనుకున్న విజయాలను కూడా సాధిస్తారు.