Site icon HashtagU Telugu

Guru Purnima 2024: గురు పౌర్ణమి రోజు గురు అనుగ్రహం కలగాలంటే ఇలా చేయాల్సిందే?

Mixcollage 21 Jul 2024 11 22 Am 9624

Mixcollage 21 Jul 2024 11 22 Am 9624

హిందువులు జరుపుకునే పండుగలలో గురు పౌర్ణమి పండుగ కూడా ఒకటి. ఈ గురు పౌర్ణమి పండుగను ప్రతి సంవత్సరం ఆషాడమాసం లోని శుక్లపక్ష పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఈ సంవత్సరం ఆషాఢ పౌర్ణమి తిధి రెండు రోజులు అంటే మిగులు తగులుగా వచ్చింది. ఈ పౌర్ణమి తిథి జూలై 20న ప్రారంభమై జూలై 21న ముగుస్తుంది. మరి ఈ పండుగను ఎప్పుడు జరుపుకోవాలి, గురు అనుగ్రహం కోసం ఎలాంటివి పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..కాగా ఆషాఢ మాసంలోని శుక్ల పక్ష పౌర్ణమి తిది జూలై 20న సాయంత్రం 5:59 గంటలకు ప్రారంభమై మర్నాడు అంటే జూలై 21న మధ్యాహ్నం 03:46 గంటలకు ముగుస్తుంది.

అయితే హిందూ సంప్రదాయంలో సూర్యోదయం సమయంలో ఉన్న తిధిని పరిగణలోకి తీసుకుంటారు. కాబట్టి జూలై 21వ తేదీ ఉదయం 05:37 గంటలకు ఆషాఢ పౌర్ణమి తిథి నాడు సూర్యోదయం అవుతుంది. అటువంటి పరిస్థితిలో జూలై 21 ఆదివారం రోజున గురు పౌర్ణమిగా జరుపుకుంటారు. అయితే ఈ ఆషాఢ పౌర్ణమి రోజున స్నానం, దానం చేయాలనుకుంటే జూలై 21న ఉదయం 04:14 నుండి 04:54 వరకు బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేయవచ్చు. ఈ సమయంలో స్నానం చేయలేకపోతే సూర్యోదయం తర్వాత కూడా స్నానం చేయవచ్చు. ఆ తర్వాత సామర్థ్యం మేరకు చంద్రునికి సంబంధించిన వస్తువులను దానం చేయడం మంచిది.

అయితే ఆషాఢ పూర్ణిమ ఉపవాసం ఒక రోజు ముందుగా అంటే జూలై 20న ఆచరించబడుతుంది. ఇకపోతే ఈ గురు పూర్ణిమ నాడు చేయాల్సిన పరిహారాల విషయానికి వస్తే.. గురు పూర్ణిమ రోజున ఉదయం స్నానం చేసి పూజ చేసిన తర్వాత గురువు వద్దకు వెళ్లి ఇంటికి ఆహ్వానించి,వారిని గౌరవించాలి. ఆ తర్వాత పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకోవాలి. అప్పుడు వారికి ఆహారం అందించి తగిన బహుమతులను అందించాలి. గురు పూర్ణిమ రోజున ఇలా చేయడం వల్ల ప్రతి రంగంలో పురోగతిని పొందుతారట. ఎందుకంటే గురువును సేవించడం ద్వారా జాతకంలో గురు దోషం తొలగిపోతుందని చెబుతున్నారు. అదేవిధంగా గురు పూర్ణిమ రోజున పేద బ్రాహ్మణుడికి పసుపు వస్త్రాలు, పసుపు, ఇత్తడి పాత్రలు, బెల్లం, నెయ్యి, పసుపు బియ్యం మొదలైన వాటిని దానం చేయడం వల్ల అంతా మంచే జరుగుతుందని చెబుతున్నారు. ఈ రోజున దేవ గురువైన బృహస్పతిని ఆరాధించడం వలన సంతోషం, సౌభాగ్యం కలుగుతాయట.