Lucky Zodiac Signs: జనవరి 1నుంచి ఈ రాశుల వారి దశ తిరగడం ఖాయం.. లక్ష్మీ ఇంట్లో తాండవ మాడాల్సిందే?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల రాశిచక్రం మార్పు 12 రాశుల జీవితంలో శుభ లేదా అశుభ ప్రభావాలను కలిగి ఉంటుంది. ఇకపోతే ఈ ఏడాదిలో ఈ నెల అనగా డి

  • Written By:
  • Publish Date - December 5, 2023 / 03:15 PM IST

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల రాశిచక్రం మార్పు 12 రాశుల జీవితంలో శుభ లేదా అశుభ ప్రభావాలను కలిగి ఉంటుంది. ఇకపోతే ఈ ఏడాదిలో ఈ నెల అనగా డిసెంబర్ చాలా ప్రత్యేకమైన నెల. ఎందుకంటె డిసెంబర్ నెల జ్యోతిష్యం ప్రకారం అత్యంత కీలకం. ఈ నెలలోనే కొన్ని ముఖ్యమైన గ్రహ సంచారాలు జరగబోతున్నాయి. అలాగే నక్షత్రాలు కూడా వాటి రాశులను మార్చుకోబోతున్నాయి. దాంతో 12 రాశుల వారిపై ప్రభావం పడుతుంది. డిసెంబర్ లో శుక్రుడు, సూర్యుడు, బుధుడు, బృహస్పతి, కుజుడు ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేయబోతున్నాయి. ఇక, ప్రస్తుతం దేవగురు బృహస్పతి మేషరాశిలో తిరోగమనంలో ఉన్నాడు.

గురుడు డిసెంబరు 31న అదే రాశిలో నేరుగా నడవనున్నాడు. జ్యోతిష్యంలో బృహస్పతిని దేవగురు అని పిలుస్తారు. దేవగురువు బృహస్పతి విజ్ఞానం, గురువు, బిడ్డ, అన్నయ్య, విద్య, మతపరమైన పని, పవిత్ర స్థలం, సంపద, దాతృత్వం, పుణ్యం,వృద్ధి మొదలైన వాటికి కారకుడు అని చెప్పబడింది. దేవగురు బృహస్పతి ప్రస్తుతం మేషరాశిలో తిరోగమన స్థితిలో కూర్చున్నాడు. డిసెంబర్ 31న బృహస్పతి ప్రత్యక్షం అవుతుంది. దీంతో బృహస్పతి జనవరి 1 నుంచి ఏ రాశి వారికి ఆహ్లాదకరమైన ఫలితాలను ఇస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

మేష రాశి.. దేవగురువు బృహస్పతి తిరోగమన స్థితిలో మేషరాశి వారు ఆహ్లాదకరమైన ఫలితాలను పొందవచ్చు. ఈ సమయంలో మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు. అలాగే మీరు మీ కెరీర్‌ లో మంచి ఫలితాలను పొందవచ్చు. తిరోగమన బృహస్పతి కాలంలో ముఖ్యంగా వ్యాపారులు ఎక్కువ లాభాలు పొందవచ్చు. మీ ప్రతిభకు ప్రశంసలు దక్కుతాయి. రచన, జర్నలిజం లేదా విద్యా రంగానికి సంబంధించిన వ్యక్తులు ఈ సమయంలో ప్రత్యేక ప్రయోజనాలను పొందుతారు. అంతేకాకుండా ఈ గ్రహాల సంచారం మేష రాశికి బాగా కలిసి రానుంది. అలాగే మీరు ప్రతి పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. మీకు విదేశాల్లో మంచి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా పెండింగ్ లో ఉన్న పనులన్నీ కూడా పూర్తవుతాయి.

మీన రాశి.. ఈ రాశికి బృహస్పతి అధిపతి. ఈ రాశి వారు వృత్తిపరమైన రంగాలలో మంచి విజయాన్ని సాధిస్తారు. అలాగే ప్రభుత్వం ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్తలు అందుతాయి. విద్యా పోటీలలో విజయం సాధిస్తారు. అలాగే మీకున్నటువంటి ఆర్థిక సంక్షోభాలు కూడా తొలగిపోతాయి. ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్న వారికి సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. సమాజంలో మీ స్థానం కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. మీరు చేసే ప్రతి ఒక్క పనిలో కూడా అదృష్టం కలిసి రావడంతో పాటు వ్యాపార నిమిత్తం దూర ప్రయాణాలు కూడా చేయాల్సి వస్తుంది.

సింహం.. సింహ రాశి వారికి బృహస్పతి సంచారం కలిసి వస్తుంది. ఈ రాశి వారికి డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే అప్పుల బాధ నుంచి విముక్తి పొందుతారు. కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి. వృత్తి వ్యాపారం ఉద్యోగాలలో విజయం సాధిస్తారు. వీరి ఆదాయం మరింత పెరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి.

కర్కాటకం.. బృహస్పతి ప్రత్యక్ష సంచారం కర్కాటక రాశి వారికి మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు. అలాగే కుటుంబంతో కలిసి కాస్త సమయాన్ని గడుపుతారు. వైవాహిక జీవితం కూడా బాగుంటుంది. లక్ష్యసాధనలో విజయం సాధించవచ్చు. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. అలాగే కెరియర్ పరంగా మంచి మంచి అవకాశాలను అందుకుంటారు. మీరు భూములు లేదంటే ఖరీదైన వస్తువులను కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.