Gupta Navratri 2023 ghatsthapna: జనవరి 22 నుంచి గుప్త నవరాత్రులు.. ఘటస్థాపన, పూజా విధానం వివరాలివే

నవరాత్రి సంవత్సరానికి నాలుగు సార్లు జరుపుకుంటారు. చైత్ర నవరాత్రులు , శారదీయ నవరాత్రులు కాకుండా..

  • Written By:
  • Publish Date - January 22, 2023 / 09:30 PM IST

Gupta Navratri 2023 ghatsthapna: నవరాత్రి సంవత్సరానికి నాలుగు సార్లు జరుపుకుంటారు. చైత్ర నవరాత్రులు , శారదీయ నవరాత్రులు కాకుండా.. గుప్త నవరాత్రులు కూడా రెండుసార్లు వస్తాయి. గుప్త నవరాత్రి మాఘం , ఆషాఢ మాసాలలో వస్తుంది. ఈసారి మాఘమాసం గుప్త నవరాత్రులు జనవరి 22 నుంచి జనవరి 30 వరకు జరగ బోతున్నాయి. వాస్తవానికి గుప్త నవరాత్రి మాఘ, ఆషాఢ మాసాల్లో వస్తుంది. సాధారణ, గుప్త నవరాత్రుల మధ్య కొన్ని తేడాలు ఉన్నాయి. అవేమిటంటే..
సాధారణ నవరాత్రులలో సాత్విక , తాంత్రిక పూజలు రెండూ జరుగుతాయి. అయితే గుప్త నవరాత్రులలో ఎక్కువగా తాంత్రిక పూజలు జరుగుతాయి.  సాధారణంగా గుప్త నవరాత్రుల గురించి పబ్లిసిటీ చేయరు.  ఇందులో చేసే సాధన గోప్యంగా, గుప్తంగా ఉంచబడుతుంది.  ఎందుకంటే..గుప్త నవరాత్రులలో పూజలు ఎంత రహస్యంగా ఉంటే.. విజయం అంత గొప్పగా ఉంటుంది.రహస్య అభ్యాసాలకు గుప్త నవరాత్రులను ముఖ్యమైనవిగా పరిగణిస్తారు.

ఘటస్థాపనకు శుభ సమయం..

మాఘ గుప్త నవరాత్రులలో ఘటస్థాపన యొక్క శుభ సమయం విషయానికి వస్తే.. గుప్త నవరాత్రుల ఘటస్థాపన
ప్రతిపాద తేదీలో జరుగుతుంది.  హిందూ క్యాలెండర్ ప్రకారం మాఘ మాసం శుక్ల పక్షం యొక్క ప్రతిపద తేదీ జనవరి 22వ తేదీన మధ్యాహ్నం 02.22 నుంచి జనవరి 22వ తేదీ రాత్రి 10.27 వరకు ఉంటుంది. ఈ సందర్భంలో, జనవరి 22న ఉదయాన్నే ఘటస్థాపన జరుగుతుంది. ఆ రోజున ఉదయం 09.59 గంటల నుంచి 10.46 గంటల వరకు ఘటస్థాపనకు శుభముహూర్తం ఉంది. మొత్తం గుప్త నవరాత్రులలో అర్ధరాత్రి లక్ష్మి అమ్మవారిని పూజించండి. అమ్మవారి ముందు నెయ్యి దీపం వెలిగించి శ్రీ సూక్తం పఠించండి.

* అమ్మవారి ఆరాధన విధానం

గుప్త నవరాత్రులలోనూ సాధారణ నవరాత్రులలాగా తొమ్మిది రోజులపాటు కలశాన్ని స్థాపించవచ్చు. కలశ స్థాపన చేసేవారు చాలీసా లేదా సప్తశతి రెండింటినీ పఠించాలి. రెండు పూటలా హారతి చేస్తే బాగుంటుంది. రెండు సమయాలలో తల్లికి భోగ్ సమర్పించండి.  లవంగాలు, బటాషా సరళమైన ఉత్తమమైన భోగ్‌గా పరిగణిస్తారు.
ఎరుపు పువ్వు అంటే తల్లికి ఇష్టం. అమ్మవారికి ఆక్, మదార్, దూబ్ , తులసిని అస్సలు సమర్పించ వద్దు. మొత్తం తొమ్మిది రోజులు సాత్విక ఆహారాన్ని తీసుకోండి.

* అమ్మవారి కటాక్షం కోసం..

గుప్త నవరాత్రులలో అమ్మవారి ముందు నెయ్యి దీపం వెలిగించండి. తొమ్మిది బటాష్‌లను తీసుకుని, ఒక్కో బటాషేపై రెండు లవంగాలు ఉంచి.. అమ్మవారికి ఒక్కొక్కటిగా సమర్పించండి. ఈ పూజను నవరాత్రులలో ఏ రాత్రి అయినా చేయవచ్చు. త్వరగా పెళ్లి కావాలని కోరుకునే వారు అమ్మవారి ముందు రోజూ నెయ్యి దీపం వెలిగించాలి. ప్రతిరోజూ ఎర్రటి పూల దండను సమర్పించండి.  నవరాత్రిలో ప్రతి రోజు రాత్రి ఈ ప్రార్థన చేయండి.