Site icon HashtagU Telugu

Gummadikaya Masala: వెరైటీగా ఉండే గుమ్మడికాయ మసాలా.. ట్రై చేయండిలా?

Gummadikaya Masala

Gummadikaya Masala

మామూలుగా గుమ్మడికాయతో గుమ్మడికాయ హల్వా, గుమ్మడికాయ పాయసం గుమ్మడికాయ పప్పు అంటూ రకరకాల ఐటమ్స్ చేస్తూ ఉంటారు. చాలామంది గుమ్మడికాయ తో కొత్త కొత్త రెసిపీలను కూడా ట్రై చేస్తూ ఉంటారు. అటువంటి వారి కోసం ఈ రెసిపీ. ఇంట్లోనే గుమ్మడికాయ మసాలా రెసిపీని ఎలా చేయాలి అందుకు ఏ ఏ పదార్థాలు కావాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

గుమ్మడికాయ మసాలా కావలసిన పదార్థాలు:

గుమ్మడికాయ ముక్కలు – ఒకటన్నర కప్పు
ఉల్లిపాయ ముక్కలు – అరకప్పు
పాలు – అరకప్పు
పచ్చిమిర్చి – 2
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 చెంచా
గరం మసాలా -1 చెంచా
జీలకర్ర – అరచెంచా
ఆవాలు – అరచెంచా
కారం – అరచెంచా
పసుపు – చిటికెడు
ఉప్పు – తగినంత
నూనె – సరిపడా
కరివేపాకు – 1 రెమ్మ

గుమ్మడికాయ మసాలా తయారీ విధానం:

ముందుగా స్టౌ మీద కడాయి పెట్టి నూనె వేయాలి. నూనె వేడెక్కాక కరివేపాకు, జీలకర్ర, ఆవాలు వేయాలి. చిటపటలాడాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి, ఉప్పు చల్లాలి. వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకూ వేయించాలి. తరువాత గుమ్మడికాయ ముక్కలు వేసి, పసుపు చల్లి మూత పెట్టాలి. ఓ అయిదు నిమిషాల పాటు మగ్గిన తరువాత పాలు పోసి కలిపి మళ్లీ మూత పెట్టేయాలి. గుమ్మడికాయ ముక్క మెత్తబడిన తరువాత కారం, గరం మసాలా పొడి వేసి మళ్లీ మూత పెట్టేయాలి. పాలు పోసి ఉడికించి దించేసుకోవాలి. అంతే ఎంతో టేస్టీగా ఉండే గుమ్మడికాయ మసాలా రెడీ.