Ram Lalla Idol: భారత దేశ మహోజ్వలమైన సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే ఒక చారిత్రకమైన ఘట్టం కళ్ల ముందు ఆవిష్కారం అయింది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న రామమందిరం కల సాకారమవడంతో బాలరాముడు ఎట్టకేలకు అయోధ్యలో కొలువుదీరాడు. సోమవారం ప్రాణ ప్రతిష్ట జరగడంతో యావత్ దేశమంతటా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ప్రజలు అందరూ టీవీలకు అతుక్కుపోయి బాల రాముడు ను కనులారా దర్శించుకున్నారు. మంగళవారం నుంచి సామాన్యభక్తులను ఆలయదర్శనానికి అనుమతించడంతో భక్తులు పెద్ద ఎత్తున ఆలయాన్ని దర్శించుకోవడానికి బారులు తీరారు.
ఇక ఈ రామలయ నిర్మాణానికి రామ భక్తులు ఎందరో తన వంతుగా సాయం చేశారు. దేశ, విదేశాలకు చెందిన భక్తులు భారీగా విరాళాలు సమకూర్చారు. ఇందులో సామాన్య భక్తుల నుంచి పెద్ద పెద్ద వ్యాపారులు బడా పారిశ్రామిక వేత్తలు కార్పొరేట్ దిగ్గజాలు తమ వంతు సాయం అందించి శ్రీరాముని సేవలో తరించారు..ఇక గుజారాత్ కు చెందిన వజ్ర వ్యాపారి ముఖేష్ పటేల్ రామ్ లల్లా విగ్రహానికి బంగారు కిరీటం చేయించి విరాళంగా ఇచ్చారు. దీని విలువ సుమారుగా 11 కోట్ల ఉంటుందని అంచానా. సూరత్ లోని గ్రీన్ ల్యాబ్ డైమండ్ కంపెనీ యజమానే ఈ ముఖేష్ పటేల్.
Ram Lalla Idol
ముకేశ్ పటేల్ తన కుటుంబ సభ్యులతో కలిసి అయోధ్యను సందర్శించి ఆలయ ట్రస్ట్ అధికారులకు బంగారం, వజ్రాలు, వైడుర్యాలతో తయారుచేసిన 6 కిలోల బరువున్న కిరీటాన్ని సమర్పించారు. రామమందిరం ప్రధాన అర్చకులు, శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ధర్మకర్తల సమక్షంలో ముఖేష్ పటేల్ ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమంలో కిరీటాన్ని అందజేయటం విశేషం.
Also Read: ICC Test Team of the Year: 2023 అత్యుత్తమ టెస్టు జట్టులో సత్తా చాటిన ఆస్ట్రేలియా