హిందూ మతంలో దేవుడికి పూజ చేసిన తర్వాత ధూపం వేయడం అన్నది పురాతన కాలం నుంచి ఆనవాయితీగా వస్తోంది. అగరబత్తులు సుగంధం లేకుండా సంపూర్ణమైన పూజలు ఏవీ జరగవు. దీంతో పాటు ధూపం వేయడం వల్ల మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది. ఇంటి వాతావరణం కూడా స్వచ్ఛంగా ఉంటుంది. ఆ ప్రదేశం అంతా కూడా పాజిటివ్ తో నిండి పోతుంది. హిందూ గ్రంధాలలో ధూపానికి చాలా ప్రాముఖ్యత ఉంది. వేర్వేరు వస్తువులతో వేసే దూపం వేర్వేరు ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ధూపం వేయడం ద్వారా వ్యాధుల నుంచి విముక్తి పొందవచ్చు.
ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఒక్క హిందూ మతంలోనే కాకుండా చాలా మతాలలో ధూపం వేస్తారు. ఇలా ధూపం వేయడం వల్ల ఆరోగ్యపరంగానే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా ఎన్నో రకాల లాభాలు ఉన్నాయి. చాలామంది ఇంట్లో గుగ్గిలం ధూపం వేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. గురువారమే ఇంట్లో గుగ్గిలం ధూపం వేయాలి. గుగ్గిలం వాసన మెదడు లోని నొప్పిని, దాని సంబంధిత వ్యాధులను నాశనం చేస్తుంది. గుండె నొప్పి నిరోధించేందుకు ప్రయోజనకరంగా వుంటుందని పరిగణించబడుతుంది. అంతేకాకుండా గుగ్గిలం ధూపంతో ఇంట్లో కలహాలు కూడా సద్దుమణుగుతాయి.
గుగ్గిలం ధూపం అతీంద్రియ లేదా దైవిక శక్తులను ఆకర్షిస్తుంది, వ్యక్తికి సహాయపడుతుందని చెప్పబడింది. గుగ్గిలం ధూపం ఇవ్వడం వల్ల భూగోళానికి శాంతి కలుగుతుంది. గుగ్గిలం ధూపం వేయడం వల్ల ఇంట్లోని వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా లక్ష్మీదేవి కూడా ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీ అంతా కూడా పోయి పాజిటివ్ ఎనర్జీ నిండుకుంటుంది..