Site icon HashtagU Telugu

Some Plants: మీ ఇంటి ముందు కూడా అలాంటి మొక్కలు పెరిగాయా.. అయితే లక్ష్మి ఇంట్లోకి వచ్చినట్టే?

Mixcollage 12 Jul 2024 04 47 Pm 1238

Mixcollage 12 Jul 2024 04 47 Pm 1238

మామూలుగా మన ఇంటి ముందు గార్డెన్ లేదంటే ఓపెన్ ప్లేస్ లాంటిది ఉన్నప్పుడు రకరకాల మొక్కలు మొలుస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఇంటిముందు బాగా ప్లేస్ ఉన్నవారికి అలాగే పల్లెటూర్లలో ఉన్న వారి ఇంటి ముందు కొన్ని కొన్ని మొక్కలు పెరుగుతూ ఉంటాయి. అయితే కొన్ని రకాల మొక్కలు కనుక మీ ఇంటి ముందు పెరుగుతున్నట్టు అయితే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చినట్టే అంటున్నారు. మరి ఇంటి ముందు ఎలాంటి మొక్కలు పెరగడం మంచిదో ప్పుడు మనం తెలుసుకుందాం.. ఇంటి ముందర వాకిట్లో, ఇంటికి ఎదురుగా తులసి మొక్క పెరిగితే ఇంటికి మహాలక్ష్మి రాబోతుంది అనడానికి సంకేతంగా భావించాలి.

ఇంటి ముందర తులసి మొక్కకు నీళ్లు పోయకపోయినా దానంతట అదే పెరిగితే ఇంట్లో ధనం కూడా అలాగే పెరుగుతుందని అర్థం. ఇలా పెరిగిన మొక్కలను ఎవరికైనా దానం చేస్తే కూడా మంచి ఫలితం లభిస్తుంది. అయితే ఎట్టిపరిస్థితిలో తులసి మొక్కను అమ్మకూడదు. అలా అమ్మితే ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్లిపోతుంది. తులసి మొక్క ఎండిపోతే అశుభ ఫలితాలను ఇస్తుంది. తులసి మొక్క ఎండిపోయిందని అనవద్దు. తులసి మొక్క నిద్రపోతోందని అనాలి. కాబట్టి తులసి మొక్కను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే ఇంట్లో బొప్పాయి మొక్క పెరగడం కూడా ఇంటికి మంచిది కాదు.

ఈ మొక్క పెరిగితే దాన్ని తీసివేయాలని పండితులు చెబుతున్నారు. ఇంట్లో అలాగే పెంచడం వల్ల కష్టాలు రాబోతున్నాయని సంకేతంగా భావించాలి. ఇంట్లోంచి ఈ మొక్కను తీసి వేరే ఎక్కడైనా పాతిపెట్టాలి. అలాగే ఇంట్లో వేపమొక్క పెరగడం శుభాన్ని కలిగిస్తుంది. వేప మొక్కలో ఎన్నో ఔషధగుణాలు ఉంటాయి. వేపమొక్క ఎక్కడైతే వుంటుందో అక్కడ రోగాలు రాకుండా దూరంగా వెళ్లిపోతాయి. హిందువులలో చాలామంది వేప చెట్టును దేవతగా భావించి పూజలు కూడా చేస్తూ ఉంటారు. ఇంటి పరిసరాల్లో వేపమొక్క పెరిగితే అస్సలు తీసేయకండి. ఇంటి ముందట తెల్లజిల్లేడు మొక్క పెరగడం ఇంటికి అంత మంచిది కాదట. ఈ మొక్క నుంచి పాలు కారుతాయి. ఇలా పాలు కారే మొక్కలు ఇంటి పరిసరాల్లో వుండడం అంత మంచిది కాదని హెచ్చరిస్తున్నారు పండితులు.

ఈ మెక్కను పసుపు కుంకుమ పూసి పూజ చేసి ఈ మొక్కను బయట ఎక్కడైనా పాతిపెట్టాలి. ఇంట్లో ఒక్కడైనా నీటిలో లేదా వాటర్ ట్యాంక్‌లో కమలం మొక్క వస్తే సాక్షాత్తూ లక్ష్మీ దేవి ఇంటికి వచ్చినట్టేనని శాస్త్రం చెబుతోంది. ఇలాంటి వారి ఇళ్లల్లో ఆర్థిక సమస్యలు కూడా ఎక్కువగా రావట. రావి చెట్టు పెరిగితే కూడా చాలా మంచిదేఅని పండితులు చెబుతున్నారు. ఎందుకంటె రావి చెట్టులో సకల దేవీదేవతలు నివసిస్తారు. రావి చెట్టు చాలా పెద్దగా పెరుగుతుంది. ప్రతీ రోజూ పూజ చేయకపోతే అశుభం జరుగుతుంది. కాబట్టి ఈ మొక్కకు పూజ చేసి ఎక్కడైనా పాతిపెట్టాలి.