Site icon HashtagU Telugu

Ayodhya : అయోధ్యలో మరో 13 దేవాలయాల నిర్మాణానికి ట్రస్ట్ ఏర్పాట్లు

Ayodya 13

Ayodya 13

అయోధ్య (Ayodhya) రామ మందిర ప్రాణ ప్రతిష్ట (Ram Temple Opening)కార్యక్రమం ప్రధాని నరేంద్రమోదీ (PM Modi) చేతుల మీదుగా సోమవారం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు , వేలాది ప్రముఖులు హాజరయ్యారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఘట్టానికి తెరపడడంతో అంత అయోధ్య రాముడి గురించి..అక్కడి ప్రసాదాలు , రాముడి దర్శనం గురించి మాట్లాడుకోవడం..సెర్చ్ చేయడం చేస్తున్నారు. ఈ క్రమంలో రామ‌జ‌న్మ భూమి తీర్థ‌క్షేత్ర ట్ర‌స్ట్ మరో తీపి కబురు తెలిపి భక్తుల్లో మరింత సంతోషం నింపింది.

We’re now on WhatsApp. Click to Join.

అయోధ్య లో కేవలం రామ మందిరం మాత్రం కాదు మరో 13 దేవాలయాలను నిర్మించబోతున్నట్లు రామ‌జ‌న్మ‌భూమి తీర్థ ట్ర‌స్ట్(RamaJanma Bhoomi Theertha trust) కోశాధికారి స్వామి గురుదేవ్ గిరీజీ(Swami guru dev Giriji) తెలిపారు. 13 ప్ర‌ధాన ఆల‌యాల్లో ఆరు దేవాల‌యాలు.. అయోధ్య రామ‌మందిరం లోప‌లే(Inside) నిర్మించ‌నుండ‌గా.. మిగిలిన వాటిని వెలుప‌ల నిర్మించనున్నారట. ఆయా ఆల‌యాల‌కు సంబంధించిన ప‌నులు.. ప్ర‌స్తుతం పురోగ‌తిలో ఉన్నట్లు మీడియా కు వెల్లడించారు. ప్రస్తుతం ఆలయంలో రాముడి ప్రాణ ప్ర‌తిష్ఠ జరిగింది..అది ఫ‌స్ట్ ఫ్లోర్ లో.. రెండో అంత‌స్థు ఫ్లోర్ లో ప‌నులు పురోగ‌తిలో ఉన్నాయి. త‌ర్వాత‌ శిఖ‌రం(Shikhar), పైక‌ప్పు త్వ‌ర‌లోనే పూర్తి కానుందని తెలిపారు. రాముడు విష్ణువు యొక్క అవతారంగా పరిగణించబడుతున్నందున, గణపతి, శివుడు, సూర్యుడు, జగదాంబ దేవతల ఆల‌యాల‌ను నిర్మిస్తున్నామ‌న్నారు. ప్రధాన ఆలయానికి నాలుగు మూలల్లో ఈ ఆలయాలు ఉంటాయన్నారు.

ప్ర‌స్తుతం పాలిషింగ్, ఫినిషింగ్ టచ్ ప‌నులు మిగిలి ఉన్నాయ‌న్నారు. సీతా ర‌సోయి దగ్గర, సీతా దేవి వంటగదిగా పరిగణించబడే ప్రదేశంలో అన్నపూర్ణ దేవి ఆల‌యాన్ని నిర్మించ‌నున్న‌ట్టు గురుదేవ్‌ తెలిపారు. అలాగే సాధువులైన వాల్మీకి(Valmiki), వశిష్టుడు(Vasishta), విశ్వామిత్రుడు(Viswamitra), శబ‌రి(Shabari), రాముడి కోసం తన ప్రాణాలను అర్పించిన పక్షి జటాయువు వంటివి కూడా నిర్మిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఇలా మొత్తం మీద రాముడి చరిత్ర తెలిపి అందరివీ ఆలయంలో ఉండేలా నిర్మిస్తున్నట్లు స్పష్టం చేసారు.

Read Also : New Ration Cards : కొత్త రేషన్ కార్డులకు ‘మీసేవ’లో అప్లికేషన్లు.. ఎప్పటి నుంచి అంటే..