Shani Dev: శని దేవుని అనుగ్రహం లభించిందని సూచించే సంకేతాలివే?

సాధారణంగా చాలామంది శనీశ్వరుని పేరు వినగానే భయపడుతూ ఉంటారు. శనీశ్వరుని పేరుగానే ఉలిక్కిపడడం

  • Written By:
  • Publish Date - December 26, 2022 / 06:00 AM IST

సాధారణంగా చాలామంది శనీశ్వరుని పేరు వినగానే భయపడుతూ ఉంటారు. శనీశ్వరుని పేరుగానే ఉలిక్కిపడడం ఆందోళన చెందడం లాంటివి చేస్తూ ఉంటారు. కొంతమంది అయితే శనీశ్వరుని గుడికి వెళ్ళాలి అన్న శని దేవుని ప్రార్థించాలి అన్న కూడా భయపడుతూ ఉంటారు. అలాగే జాతకంలో శని ప్రభావాలు ఉండకూడదని కోరుకుంటూ ఉంటారు. కానీ సాధారణ దేవుళ్ళ లాగే శనీశ్వరుని కూడా ఆరాధించే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. చాలామంది ప్రతి శనివారం శని దేవుని ఆలయాలకు వెళ్లి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. అయితే శని దేవుని అనుగ్రహం లభిస్తే చాలు వాళ్ళు కోటీశ్వరులు అవుతారు. అయితే శని దేవుని కృప జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయి.

మరి ముఖ్యంగా శని దేవుని అనుగ్రహంతో జీవితంలో సకల సౌకర్యాలు దక్కుతాయ్. శని అనుగ్రహం లభిస్తే ఎటువంటి సంకేతాలు కనిపిస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. శని అనుగ్రహం లభిస్తే మంచి ఆరోగ్యం బాగా ఉండటంతో పాటు ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండవు. ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా జీవించినప్పుడు కూడా శని దేవుని అనుగ్రహంగా చెప్పవచ్చు. ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉన్నప్పుడు రోగులకు సహాయం చేయడం మంచిది. అదేఈ విధంగా శనివారం రోజు ఆలయానికి వెళ్లి శని దేవుని ప్రార్థించడం మంచిది. మీ కీర్తి ప్రతిష్టలు మర్యాదలు వేగంగా పెరుగుతుంటే శనీశ్వరుని అనుగ్రహం లభించినట్టే అని చెప్పవచ్చు.

శని అనుగ్రహం లభిస్తే అటువంటి వ్యక్తి కీర్తి చాలా దూరం వ్యాపిస్తుంది. అటువంటి సమయంలో శని దేవుని భక్తిశ్రద్ధలతో పూజించడం మంచిది. అదేవిధంగా శనివారం రోజు బూట్లు చెప్పులు లాంటివి దొంగలించినట్లయితే అది శుభసంకేతం అని చెప్పవచ్చు. శనిశ్వరుడు మీ పట్ల సంతోషంగా ఉన్నాడు అనడానికి అది సంకేతం. అలాగే మీరు అనుకున్న పనులు ఒక్కొక్కటిగా సక్సెస్ఫుల్ అవుతాయి.