TTD : తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్…వేలానికి స్వామివారి వస్తువులు..వేలంలో ఎలా పాల్గొనాలంటే..?

కలియుగ దైవం...శ్రీవేంకటేశ్వరస్వామి కొలువైన దివ్యక్షేత్రం తిరుమలకు భక్తులు భారీగా పోటెత్తుతున్నారు. ఎండలను కూడా లెక్కచేయకుండా...భక్తులు గంటలకొద్దీ క్యూలైన్లలో నిల్చుని స్వామివారిని దర్శించుకుంటున్నారు.

  • Written By:
  • Publish Date - June 12, 2022 / 09:31 PM IST

కలియుగ దైవం…శ్రీవేంకటేశ్వరస్వామి కొలువైన దివ్యక్షేత్రం తిరుమలకు భక్తులు భారీగా పోటెత్తుతున్నారు. ఎండలను కూడా లెక్కచేయకుండా…భక్తులు గంటలకొద్దీ క్యూలైన్లలో నిల్చుని స్వామివారిని దర్శించుకుంటున్నారు. కోవిడ్ మహమ్మారి కారణంగా…రెండేళ్లు శ్రీవారి దర్శనానికి దూరమయ్యారు భక్తులు. అందుకే ఇప్పుడు స్వామివారిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో రికార్డు స్థాయిల భక్తులు పెరుగుతున్నారు. దానికి తగ్గట్లుగానే హుండీ ఆదాయం కూడా గతంలోకంటే భారీగా పెరుగుతూ రికార్డ్ క్రియేట్ చేస్తోంది. గతంలో ప్రత్యేకమైన రోజుల్లో మాత్రమే భక్తులు పోటేత్తావారు. కానీ ఇఫ్పుడు సాధారణ రోజుల్లో కూడా రద్దీ కనిపిస్తోంది. సర్వదర్శనానికి 48గంటలకు పైగా పట్టింది. అంటే దీన్ని బట్టి రద్దీ ఏ స్థాయిలో ఉందో అర్థం అవుతోంది. భక్తుల నుంచి వస్తున్న ఆదరణను బట్టి…టీటీడీ వరుస శుభవార్తలు చెబుతోంది.

శ్రీవారికి సాధారణంగా భారీగానే కానుకలు వస్తుంటాయి. సెలబ్రెటీల నుంచి సామాన్యుల వరకు తమ శక్తి కొద్దీ కానుకలను నిత్యం సమర్పిస్తుంటారు. ధన, కనుక, వస్తువులను కానులుగా ఇస్తుంటారు. భూరి భూమిని కూడా విరాళంగా ఇస్తారు. లక్షల్లో, కోట్లలో కూడా విరాళాలు ఇస్తుంటారు. సామాన్యులు వారి స్తోమతను బట్టి కానుకలు సమర్పించుకుంటారు. అయితే స్వామివారికి సమర్పించిన వస్త్రాలను శేష వస్త్రాలుగా ప్రసాదంగా భక్తులు భావిస్తుంటారు. వాటిని తీసుకుని స్వామివారి ఆశీస్సులు పొందాలని భక్తులు ఆరాపటడుతుంటారు.

ఈ నేపథ్యంలో టీటీడీ స్వామివారి వస్త్రాలను ఈ వేలం వేసేందుకు రెడీ అవుతోంది. తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు ఇతర అనుబంధ ఆలయాలకు భారీగానే కానుకలు వచ్చాయి. భక్తులు కానుకగా సమర్పించిన 149 లాట్ల వస్త్రాలను టీటీటీ ఈ వేలం వేసేందుకు సిద్ధమైంది. ఈ నెల 22 నుంచి 24 వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వ కొనుగోలు పోర్టల్ ద్వారా ఈ వేలం వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. వేలంలో పాలిస్టర్ నైలాన్, నైలెక్స్ చీరలు, ఆర్ట్ సిల్క్ చీరలు, బ్లౌజ్ పీస్ లు స్వామివారి సేవకు వినియోగించిన వస్త్రాలు ఉన్నాయి.

ధనవంతుల నుంచి సామాన్యులకు వరకు ఈ వేలంలో పాల్గొనవచ్చు. స్వామివారి వస్త్రాలు కొనుగోలు చేసే ఆసక్తిగల భక్తులు ఇతర వివరాలకు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్ కార్యాలయాన్ని సంప్రదించాల్సి ఉంటుంది. ఫోన్ నెంబర్ 0877-2264429 సంప్రదించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వ పోర్టల్ www.konugolu.ap.gov.in/www.tirumala.org ని సంప్రదించి వేలానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.