Site icon HashtagU Telugu

TTD: టీటీడీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఇంటిస్థలాలతోపాటు మరిన్ని వరాలు

Tirumala Tirupati Devastanam Ttd

Tirumala Tirupati Devastanam Ttd

TTD: టీటీడీ చరిత్రలో కనీ, వినీ, ఎరుగని రీతిలో కాంట్రాక్టు, సొసైటీ ల ద్వారా టీటీడీ లో పనిచేస్తున్న ఉద్యోగులపై చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి వరాల వాన కురిపించారు. రెగ్యులర్, రిటైర్డ్ ఉద్యోగుల 30 ఏళ్ళ ఇంటి స్థలాల కల ను నిజం చేసి సమస్యలన్నీ అధిగమించి వారికి ఇంటి స్థలాలు పంపిణీ చేయించారు. గత బోర్డు సమావేశాల్లో పారిశుధ్య, పోటు, ఉగ్రాణం, వేద పాఠశాలలు, శిల్పకళాశాల తో పాటు వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఆరు వేల మంది కాంట్రాక్టు, సొసైటీ, సంభావన ఉద్యోగులకు జీతాలు పెంచారు. మిగిలిన 9 వేల 750 మందికి కూడా వారి కేడర్, సీనియారిటీ ని బట్టి 3 వేల నుండి 20వేల వరకు జీతాలు పెంచుతూ సోమవారం జరిగిన బోర్డు సమావేశంలో ఆమోద ముద్ర వేశారు.

ఈ నిర్ణయంతో ఇక టీటీడీ లో కాంట్రాక్టు, సొసైటీల ద్వారా పని చేస్తున్న ప్రతి ఉద్యోగికి జీతం పెరిగినట్లు అయ్యింది. సుమారు 15 సంవత్సరాలుగా జీతం పెరగని ఉద్యోగులకు భారీ కానుక లభించింది. ఇది కరుణాకర రెడ్డికి మాత్రమే సాధ్యం అయ్యిందని ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులందరికీ ఉద్యోగుల క్యాంటీన్లో భోజనం టీటీడీ లో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు తిరుమల ఎంప్లాఈస్ క్యాంటీన్ లో అల్పాహారం, భోజనం అందించడానికి భూమన కరుణాకర రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. రెగ్యులర్ ఉద్యోగులతో పాటు ఇక మీదట రాయితీ ధరలతో వీరికి కూడా టిఫిన్, భోజనం, టీ, కాఫీ అందిస్తారు.

Exit mobile version