TTD: టీటీడీ ఉద్యోగులకు గుడ్ న్యూస్, ఇళ్ల స్థలాలకు గ్రీన్ సిగ్నల్

  • Written By:
  • Publish Date - December 26, 2023 / 05:38 PM IST

TTD: టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు, వేతనాల పెంపుపై తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి శుభవార్త తెలిపింది. టీటీడీ ఉద్యోగులకు ఈ నెల 28న 3,518 మందికి ఇంటి పట్టాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు.. జనవరిలో మరో 1500 మందికి కూడా ఇంటిపట్టాలు ఇచ్చేందుకు టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకుంది.

ఇక రిటైర్డ్‌ ఉద్యోగులతో పాటు తదితరుల కోసం మరో 350 ఎకరాలను రూ.80 కోట్లతో ప్రభుత్వం నుంచి కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. శానిటేషన్ ఉద్యోగులు, వర్క్‌ కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాలను కూడా పెంచనున్నట్లు టీటీడీ పాలకమండలి తెలిపింది. పోటు కార్మికుల వేతనాలను రూ.28వేల నుంచి రూ.38వేలకు పెంచాలనీ నిర్ణయం తీసుకున్నారు.

ఈ మేరకు ఒకేసారి వారికి రూ.10వేల పెంపు లభించనుంది. వాహనం బేరర్లు, ఉగ్రాణం కార్మికులు, స్కిల్‌ లేబర్‌ గా గుర్తించి తగిన విధంగా వేతనాలను పెంచాలని టీటీడీ పాలక మండలి నిర్ణయించింది. కల్యాణకట్టలో పీఎస్‌ రేట్‌ బార్బర్ల వేతనం కీనం రూ.20వేలు ఇవ్వాలని నిర్ణయించారు. తిరుపతిలో పాత సత్రాలను తొలగించి కొత్త అతిథి గృహాల నిర్మాణానికి ఆమోదం తెలిపింది టీటీడీ పాలక మండలి.