Site icon HashtagU Telugu

TTD: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. టికెట్లు బుక్ చేసుకోండిలా?

F96f001c43a9f03bbec3b3ef0fbe1af21673241447380179 Original

F96f001c43a9f03bbec3b3ef0fbe1af21673241447380179 Original

TTD: తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం కోసం భక్తులు ఎంతగానో ఎదురుచూస్తూ ఉంటారు. తాజాగా జనవరి, ఫిబ్రవరి నెలల్లో తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని అనుకునేవారికి టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. జనవరి 12 నుంచి 31వ తేదీ వరకూ ఫిబ్రవరి నెలలో శ్రీవారి దర్శనం కోసం రూ. 300 ప్రత్యేక దర్శన టికెట్ల కోటాను విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.

జనవరి 9వ తేదిన ఆన్ లైన్ లో టికెట్లు అందుబాటులో ఉంటాయని టీటీడీ ప్రకటించింది. ఆయా తేదీల్లో శ్రీవారి దర్శనం కోసం రావాలని అనుకుంటున్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. టికెట్లు బుక్ చేసుకునేందుకు టీటీడీ వెబ్సైట్ ను సందర్శించాల్సి ఉంటుంది. రిజిస్టర్ చేసుకుని సైట్లో సైన్ అప్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత అకౌంట్ యాక్టివేట్ అయినట్లు చూపుతుంది. ఆ తర్వాత లాగిన్ పేజికి వెళ్లి అందుబాటులో ఉన్న తేదీలలో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.

డ్యాష్ బోర్డును చూసి దర్శనం చేసుకోవాల్సిన రోజును సెలెక్ట్ చేసుకోవచ్చు. ఖాళీలు ఉంటే గ్రీన్ కలర్ లేకుంటే రెడ్ కలర్ లో కనిపిస్తుంది. తిరుమలలో ఈ నెల 11వ తేది వరకు వైకుంఠద్వార దర్శనం అందరికీ అందుబాటులో ఉంటుంది. అందుకే స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు.

మరోవైపు తిరుమల శ్రీవారి దర్శన భాగ్యాన్ని నోచుకోని పేదల కోసం టీటీడీ ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా చేపడుతోంది. సమరసత ఫౌండేషన్ ద్వారా రాష్ట్రం నలుమూలల నుంచి తిరుమల శ్రీవారిని దర్శించుకునే భాగ్యాన్ని టీటీడీ అందరికీ కల్పిస్తోంది. ఇప్పటికే 190 గ్రామాల నుండి సుమారు 9300 మంది దళిత, గిరిజన, ఆదివాసీ మత్స్యకార భక్తులను వైకుంఠ ద్వార దర్శనానికి ఆహ్వానించినట్టు సమరసత సేవ ఫౌండేషన్‌ వెల్లడించింది.