TTD: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఆ వస్తువులను దక్కించుకోవచ్చు ఇలా

TTD: తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలలో స్వామి వారి పై భక్తితో భక్తులు హుండీ ద్వారా కానుకగా సమర్పించిన వాచీలు, మొబైల్ ఫోన్లను మార్చి 13న ఏపీ ప్రభుత్వ కొనుగోలు పోర్టల్ ద్వారా ఈ- వేలం వేయనున్నట్టు టీటీడీ ప్రకటించింది. ఇక టీటీడీ వేలం వేసే వాటిలో టైటాన్‌, క్యాషియో, టైమెక్స్‌, ఆల్విన్‌, సొనాట, టైమ్‌వెల్‌, ఫాస్ట్‌ట్రాక్, ర్యాడో కంపెనీల వాచీలున్నాయి. ఐ ఫోన్లు, వివో, నోకియా, కార్బన్, శామ్సంగ్, మోటోరోలా, ఒప్పో కంపెనీల […]

Published By: HashtagU Telugu Desk
Bomb Threats In Tirumala

Bomb Threats In Tirumala

TTD: తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలలో స్వామి వారి పై భక్తితో భక్తులు హుండీ ద్వారా కానుకగా సమర్పించిన వాచీలు, మొబైల్ ఫోన్లను మార్చి 13న ఏపీ ప్రభుత్వ కొనుగోలు పోర్టల్ ద్వారా ఈ- వేలం వేయనున్నట్టు టీటీడీ ప్రకటించింది. ఇక టీటీడీ వేలం వేసే వాటిలో టైటాన్‌, క్యాషియో, టైమెక్స్‌, ఆల్విన్‌, సొనాట, టైమ్‌వెల్‌, ఫాస్ట్‌ట్రాక్, ర్యాడో కంపెనీల వాచీలున్నాయి. ఐ ఫోన్లు, వివో, నోకియా, కార్బన్, శామ్సంగ్, మోటోరోలా, ఒప్పో కంపెనీల మొబైల్ ఫోన్లు వున్నాయి. కొత్తవి, ఉపయోగించిన, పాక్షికంగా దెబ్బతిన్న వాచీలు మొత్తం 23 లాట్లు, మొబైల్ ఫోన్లు 27 లాట్లు ఈ-వేలంలో ఉంచినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.

ఇతర వివరాలకు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్‌ కార్యాలయాన్ని 0877-2264429 నంబరులో కార్యాలయం వేళల్లో సంప్రదించాలని సూచించింది. టీటీడీ వెబ్‌సైట్‌ www.tirumala.org లేదా రాష్ట్ర ప్రభుత్వ పోర్టల్ www.konugolu.ap.gov.in ను సంప్రదించాలని టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. డయల్ యువర్ ఈవో కార్యక్రమం మార్చి 2వ తేదీ నిర్వహించనున్నట్టు టీటీడీ తెలిపింది. మార్చి 2వ తేదీ ఉదయం 9 నుండి 10 గంటల వరకు తిరుమల అన్నమయ్య భవనంలో జరుగనుంది.

  Last Updated: 04 Mar 2024, 11:56 PM IST