Site icon HashtagU Telugu

Lakshmi Devi: మీ ఇంట్లో ఇవి ఉంటే చాలు లక్ష్మీదేవి తలుపు తట్టినట్టే?

Mixcollage 03 Feb 2024 11 36 Am 3589

Mixcollage 03 Feb 2024 11 36 Am 3589

మామూలుగా చాలామంది లక్ష్మి అనుగ్రహం కోసం రకరకాల పరిహారాలు పూజలు, దానధర్మాలు చేస్తూ ఉంటారు. అయినప్పటికీ కొన్ని కొన్ని సార్లు ఆశించిన ఫలితం దక్కక కష్టాలను అనుభవిస్తూ ఉంటారు. అయితే ఒక్కసారి లక్ష్మి అనుగ్రహం కలిగింది అంటే చాలు మనకున్న సమస్యలన్నీ పురాపరారైనట్టే. కాగా లక్ష్మీ అనుగ్రహం కలగాలి అంటే ఇంట్లో కొన్ని రకాల వస్తువులు ఉండాల్సిందే అంటున్నారు పండితులు. మరి ఇంట్లో ఎలాంటి వస్తువులు ఉంటే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కొబ్బరికాయ, కొబ్బరి బొండాం లేకుండా ఏ పూజా పూర్తికాదు. ఏ పని మొదలుపెట్టాలన్నా ముందుగా కొబ్బరికాయ కొట్టమని శాస్త్రం చెబుతోంది.

లక్ష్మీదేవికి ప్రతీక అయిన కొబ్బరికి కచ్చితంగా పూజలో స్థానం లభిస్తుంది. ఇంటికి అదృష్టాన్ని తెచ్చే వస్తువుల్లో కొబ్బరి కూడా ఒకటి. ఎండుకొచ్చరి చిప్పను పూజలో ఉంచి తర్వాత దాన్ని డబ్బులు ఉంచేచోట పెట్టుకోవచ్చు. అలాగే ఇంట్లో ఉండాల్సిన వాటిల్లో తులసి మొక్క కూడా ఒకటి. తులసి మొక్కను పరమ పవిత్రంగా భావించడంతోపాటు పూజలు కూడా చేస్తూ ఉంటారు. అయితే ఎవరి ఇంట్లో తులసి మొక్క ఉంటుందో ఆ ఇల్లు తీర్థ స్వరూపమని శాస్త్రం చెబుతోంది. తులసిని ఇంటికి ఎదురుగా పెట్టుకోవడం వల్ల లక్ష్మీదేవిని ఆహ్వానించినట్లే. తులసి ఉన్న ఇల్లు సిరి సంపదలు, ఆరోగ్యం, సుఖశాంతులతో తులతూగుతుంది. అలాగే తాబేలు సుఖశాంతులకు ప్రతీక అని వాస్తు చెబుతోంది.

లోహపు తాబేలు ఇంట్లో ఉంటే మహాలక్ష్మి నడిచొస్తుందంటారు. ఇత్తడి, వెండి, గాజు తాబేలును ఇంటిలో ఉంచుకోవచ్చు.తాబేలు ప్రతిమ సుఖశాంతులకు ప్రతీక అని వాస్తు శాస్త్రం చెబుతోంది. ముత్యపు చిప్ప అనేది సాక్షాత్తూ ఇది లక్ష్మీ స్వరూపం. ఆ తల్లి మెడలో ముత్యాలహారం ఉంటుంది. సముద్ర గర్భం నుంచే ఇవి పుట్టాయి కాబట్టి ముత్యపు చిప్పలంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. ఇది ఉన్న ఇంట్లో డబ్బుకు కొదవే ఉండదు. అలాగే నెమలి ఈకలు అనగానే వెంటనే మనకు శ్రీకృష్ణుడు గుర్తుకువస్తాడు. ఆయన్ను శిఖపించ మౌళి అంటారు. నెమలి ఈకలంటే శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టం. నెమలి పింఛం ఉన్నచోట లక్ష్మీ అమ్మవారు ఉంటారు.

Exit mobile version