హైదరాబాద్ (Hyderabad) లో రేపటి నుండి బోనాల (Bonalu 2024) జాతర మొదలు కాబోతుంది. ఆషాడం మాసం మొదలుకాగానే నగరంలో బోనాల జాతరను మొదలుపెడతారు. ముందుగా గోల్కొండ (Golkonda Bonalu Celebrations)శ్రీ జగదాంబిక అమ్మవారి జాతర మొదలై..చివరగా లాల్ దర్వాజ శ్రీ సింహవాహిని అమ్మవారి బోనాల జాతర తో ముగుస్తాయి. ఈ క్రమంలో రేపు గోల్కొండ జాతర కు అంత సిద్ధమైంది. గోల్కొండ కోటిలోని అమ్మవారికి తొట్టెల, తొలి బోనం సమర్పణ, ఫలహార బండ్ల ఊరేగింపులు, రంగం, బలిగంప ఊరేగింపు వంటి వాటితో నగర వీధులు కోలాహలంగా మారనున్నాయి. గోల్కొండ కోటిలో నాలుగు వారాల పాటు కొనసాగే బోనాల ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 14న సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు, ఆ తర్వాత 21న లాల్ దర్వాజ శ్రీ సింహవాహిని అమ్మవారి బోనాల జాతర తర్వాత మళ్లీ బోనాల జాతరకు గొల్కొండ కోటలోని ముగిసేందుకు వీలుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
We’re now on WhatsApp. Click to Join.
ఇక బోనాల సంబరాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు , పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసారు. అలాగే రేపు గోల్కొండ బోనాలకు వచ్చే భక్తుల కోసం జలమండలి తాగునీటి వసతి ఏర్పాట్లు చేస్తుంది. కోట ప్రారంభంలో ఉన్న మెట్ల దగ్గరి నుంచి మొదలుకుని బోనాలు జరిగే ప్రాంతం వరకు వివిధ స్థానాల్లో తాగునీటి పాయింట్లు ఏర్పాట్లు చేసింది. దీని కోసం అవసరమైన డ్రమ్ములు, సింటెక్స్ ట్యాంకులు, పంపులు, పైప్ లైన్‌తో పాటు వంట చేసే ప్రాంతంలో స్టాండ్లు కూడా సిద్ధం చేసింది. పైపు లైన్ ద్వారా తాగునీరు అందించేందుకు అవసరమైన ట్రయల్ రన్ అధికారులు ఇప్పటికే నిర్వహించారు.
అలాగే గోల్కొండ బోనాల జాతరకు వచ్చే భక్తులకు టీజీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్ తెలిపింది. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా 75 స్పెషల్ బస్సులు ఆపరేట్ చేస్తున్నట్లు ప్రకటించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 24 ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఎక్స్ వేదికాగా పేర్కొన్నారు. సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్, సీబీఎస్, పటాన్ చెరు, ఈసీఐఎల్, మెహిదీపట్నం, దిల్ సుఖ్ నగర్, చార్మినార్, ఉప్పల్, మల్కాజిగిరి, పాత బోయిన్ పల్లి తదితర ప్రాంతాల నుంచి జాతర జరిగే గోల్కొండ కోట వరకు ఈ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉండనున్నాయని తెలిపారు.
Read Also : New Cricket Stadium: ముంబైలో కొత్త స్టేడియం.. వాంఖడే కంటే 4 రెట్లు పెద్దగా..?