Good Results: పని మీద బయటకు వెళ్తున్నారా.. అయితే ఇలా చేస్తే మీకు అంత శుభమే?

భారతదేశంలో హిందువులు ఎన్నో రకాల ఆచారాలను సంప్రదాయాలను అలాగే మూఢనమ్మకాలను పాటిస్తూ ఉంటారు.

  • Written By:
  • Publish Date - January 30, 2023 / 06:00 AM IST

భారతదేశంలో హిందువులు ఎన్నో రకాల ఆచారాలను సంప్రదాయాలను అలాగే మూఢనమ్మకాలను పాటిస్తూ ఉంటారు. అందులో భాగంగానే బయటికి వెళ్లినప్పుడు ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. బయటికి వెళ్లినప్పుడు కొన్ని రకాల పక్షులు జంతువులు కొందరు మనుషులు ఎదురుపడినప్పుడు కొద్దిసేపు కూర్చొని నీరు తాగి వెళ్లే పని సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇంకొందరు అయితే రాశిఫలాలు చూసుకొని మరి బయటికి వెళ్తూ ఉంటారు. ఈ క్రమంలోనే కొందరు ఎదురొస్తే మంచి జరుగుతుందని ఇంకొందరు ఎదురొస్తే మంచి జరగదు అని అనుకుంటూ ఉంటారు.

అయితే బయటికి పని మీద బయటకు వెళ్ళేటప్పుడు అందరి ముఖాలు చూడటం వల్ల మాత్రమే కాకుండా కొన్ని రకాల పనులు చేయడం వల్ల కూడా అనుకున్న పనులు నెరవేరుతాయి. మరి అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మనం ఏదైనా ఒక పని మీద బయటకు వెళ్లేటప్పుడు నోటిలో కొంచెం చక్కెర లేదా బెల్లం వేసుకుని వెళ్ళాలి. ఇందుకు గల కారణం చక్కెర లేదా బెల్లంలో ఉండే తియ్య దనం మాదిరిగా మనం వెళ్లిన పని కూడా సక్సెస్ అవుతుంది. అంతే కాకుండా ఇలా చేయడం వల్ల కొన్ని పాజిటివ్ వైబ్రేషన్స్ మనలో కలుగుతాయని చెబుతుంటారు. అందుకే ఏదైనా శుభకార్యానికి వెళ్ళినప్పుడు నోరు తీపి చేసుకోమని చెబుతూ ఉంటారు.

తీపి తినడం వల్ల వారు అనుకున్న పనులు నిర్విఘ్నంగా సాగుతాయి. అలాగే విఘ్నేశ్వరునికి బెల్లం అంటే ఎంతో ఇష్టం కాబట్టి ఇంట్లో నుంచి పని మీద బయటకు వెళ్ళేటప్పుడు గణేశునికి నమస్కరించుకొని చిటికెడు బెల్లాన్ని నోట్లో వేసుకొని బయటకు వెళ్లాలి. అలా చేయడం వల్ల వెళ్లిన పని సక్సెస్ అవుతుంది. విఘ్నేశ్వరుడికి పూజ చేసి వెళ్లే పని సక్సెస్ అవ్వాలని కోరుకొని బెల్లం లేదా చక్కెర నోట్లో వేసుకొని బయటకు వెళ్లడం వల్ల అనుకున్న పనులు నెరవేరుతాయి. ఒకవేళ నెరవేరకపోయిన కూడా ఆ పనులు మనకు నిదానంగా అయినా కూడా మనకు అనుకూలంగా జరుగుతాయి.