మామూలుగా మనం ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళినప్పుడు వెళ్లే పని సక్సెస్ అవ్వాలని గట్టిగా కోరుకుంటూ ఉంటాము. ఒకవేళ వెళ్లిన పని సక్సెస్ కాకపోతే పొద్దున లేచి ఎవరి ముఖం చూసానో, వెళ్లేటప్పుడు ఎవరు ఎదురయ్యారో అని తిట్టుకుంటూ ఉంటారు. వెళ్లిన పని సక్రమంగా జరిగితే పర్లేదు కానీ లేకపోతే తిట్టుకుంటూ ఉంటారు. మీరు కూడా ఇకమీదట బయటకు వెళ్లేటప్పుడు ఇప్పుడు చెప్పినట్టుగా చేస్తే వెళ్లే పనిలో విజయం లభిస్తుంది అని చెబుతున్నారు పండితులు. మరి అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ముఖ్యమైన పనుల నిమిత్తం బయటకు వెళ్లే ముందు తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుందని చెబుతున్నారు.
మనం బయటకు వెళ్లేటప్పుడు ఈ విధమైనటువంటి నియమాలను పాటించడం వల్ల మన ప్రయాణంలో ఏ విధమైనటువంటి ఆటంకాలు లేకుండా మనం వెళ్లిన పని విజయవంతంగా పూర్తి అవ్వడానికి దోహదం చేస్తుందట. మరి మనం ముఖ్యమైన పనులు నిమిత్తం బయటకు వెళ్లేటప్పుడు ఏ విధమైనటువంటి నియమాలు పాటించాలి ఎలాంటి పనులు చేయాలి అనే విషయానికి వస్తే.. ముందుగా మనం ఏదైనా పనులను మొత్తం బయటకు వెళ్లేటప్పుడు మనం చేసే ప్రయాణంలో ఈ విధమైనటువంటి ఆటంకాలు కలుగకుండా ఉండడం కోసం మన ఇంట్లో దేవుడి గదిలో నెయ్యి దీపం వెలిగించి మన ప్రయాణంలో ఆటంకాలు రాకుండా చూడాలని నమస్కరించాలట.
ముఖ్యమైన పనుల నిమిత్తం బయటకు వెళ్లేటప్పుడు మన నోటి నుంచి ఎప్పుడు కూడా ఆ శుభం పలికే మాటలు అలాగే ఇంట్లో వారితో గొడవలు పడకూడదని చెబుతున్నారు. పని నిమిత్తం ఒకసారి బయటకు వెళ్లిన తర్వాత తిరిగి లోపలికి రాకుండా ముందుగానే మనకు కావాల్సిన వస్తువులు అన్నింటిని సిద్ధపరచుకొని బయటకు వెళ్లాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఇక బయటకు వెళ్లే ముందు కుడికాలు ముందు బయటకు పెట్టి వెళ్లడం మంచిదని చెబుతున్నారు. ఇక ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు పక్షులకు లేదా జంతువులకు కాస్త ఆహారం పెట్టి వెళ్లడం మంచిది ఇక రహస్య దానం చేయడం వల్ల మీరు అనుకున్న పని సవ్యంగా జరుగుతుందని చెబుతున్నారు. ఇక మీ ఇంటికి సమీపంలో ఏదైనా ఆలయం కనుక ఉంటే దేవుడికి కొబ్బరికాయ కొట్టి మీ ప్రయాణం చేయడం మంచిదని చెబుతున్నారు.