Site icon HashtagU Telugu

Lakshmi Devi: మీ ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఫోటో ఉందా.. అయితే ఈ విషయాలు గుర్తుంచుకోవాల్సిందే!

Monday

Monday

మామూలుగా మనం ఇంట్లో చాలామంది దేవుళ్ళ ఫోటోలు పెట్టుకుని పూజలు చేస్తూ ఉంటాం. అయితే ఇలా చేయడం మంచిదే కానీ ఫోటోల ఎంపిక విషయంలో చాలామంది చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటారు. వీటి వల్ల అనేక రకాల సమస్యలు వస్తాయని చెబుతున్నారు. ఇంట్లో చాలామంది లక్ష్మీదేవి ఫోటోని పెట్టుకుంటూ ఉంటారు. కొందరు లక్ష్మీదేవి విగ్రహాలు కూడా పెట్టుకుంటారు. ఎలాంటి విగ్రహాలైనా ఎలాంటి ఫోటోలు అయినా అందులో ఉండేది లక్ష్మీదేవినే కదా అని అనుకుంటారు. అయితే నిజానికి దేవుడు ఏ రూపంలో ఉన్నా మంచే చేస్తాడు కదా అనే మూర్ఖత్వం చాలామందిలో ఉంటుంది.

కానీ దేవుళ్లలో పూజించదగిన రూపాలు కొన్ని ఉంటాయట. అలాంటి విగ్రహాలు, చిత్ర పటాలను ఇంట్లో ఉంచుకుంటేనే మంచిదని చెబుతున్నారు. మరి ఇంట్లో ఎలాంటి లక్ష్మి దేవి విగ్రహం పెట్టుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మాములుగా లక్ష్మీదేవిని ఐశ్వర్య దేవతగా భావిస్తారు. గుడ్లగూబ తన వాహనంగా పరిగణించబడుతుంది. అయితే గుడ్లగూబపై స్వారీ చేస్తున్న లక్ష్మీదేవి చిత్రాన్ని ఇంట్లో ఉంచకూడదట. ఎందుకంటె లక్ష్మీ దేవి గుడ్లగూబతో కలిగిన చిత్రపటం, విగ్రహం ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి గుడ్లగూబపై స్వారీ చేస్తుందని ఒక నమ్మకం. అంటే ధనం నిలకడగా, స్థిరంగా ఉండదని అర్ధం. అందువల్ల గుడ్లగూబతో కూడిన లక్ష్మీదేవి చిత్రపటం ఇంట్లో ఉండటం మంచిది కాదని చెబుతున్నారు. అలాగే ఎప్పుడు కూడా లక్ష్మీదేవి నిలబడి ఉన్న భంగిమలో ఉన్న ఫోటోని ఇంట్లో పెట్టుకోవడం మంచిది కాదట. ఇలాంటి భంగిమ ఉన్న ఫోటో ఎక్కడ అయితే ఉంటుందో లక్ష్మీదేవి అలాగే వచ్చినట్టు వచ్చే వెళ్ళిపోతుందని చెబుతున్నారు. లక్ష్మీదేవి విగ్రహం లేదా చిత్రపటం ఎల్లప్పుడూ కూర్చుని ఉన్న భంగిమలోనే ఉండాలట.

లక్ష్మీదేవి తామరపువ్వుపై కూర్చొని బంగారు నాణేలను కురిపిస్తున్న చిత్ర పటం శుభప్రదంగా భావించాలని చెబుతున్నారు. ఇలాంటి చిత్ర పటాలు సంపద, శ్రేయస్సును ప్రసాదించే లక్ష్మీ దేవి శక్తిని సూచిస్తాయట. ఇలాంటి ఫొటోలు ఇంట్లో ఉంటేనే మంచిదని చెబుతున్నారు. అలాగే ఆశీర్వాద భంగిమలో కూర్చునే ఉన్న లక్ష్మీదేవి పటాన్ని కూడా ఇంట్లో ఉంచడం శుభప్రదం అని చెబుతున్నారు. అలాంటి చిత్రపటం ఇంట్లో ఉంటే సానుకూల శక్తిని వ్యాప్తి చేస్తుందట. లక్ష్మీదేవి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఆ ఇంటి వ్యక్తులపై ఉంటుందని చెబుతున్నారు..