Site icon HashtagU Telugu

Lakshmi Devi and Salt: ఉప్పుతో ఇలా చేస్తే …మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్టవేస్తుంది..!!

Lakshmi Devi

Lakshmi Devi

ధనం మూలం ఇదం జగత్ అంటారు పెద్దలు. ప్రస్తుత కాలంలో ధనం అందరికీ ముఖ్యమైందే. అప్పులతో ఆర్థిక సమస్యలతో చాలామంది సతమతమవుతున్నారు. రుణబాధలు, ఆర్థిక సమస్యలు తగ్గి ధనవంతులుగా మారేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఎంతకష్టపడినప్పటికీ…ఆర్థిక సమస్యలు తీరనివారు కూడా ఎంతో మంది ఉన్నారు. అలాంటివారు ఉప్పుతో ఈ క్రింత పేర్కొన్న విధంగా చేసినట్లయితే…ఆర్థిక సమస్యలు, రుణబాధలు తగ్గి ధనవంతులు అవుతారని పండితులు చెబుతున్నారు. ఎలాగో చూద్దాం.

ఉప్పుకు..లక్ష్మీదేవికి సంబంధం ఉంది. ఉప్పంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతి అట. చాలామంది కష్టపడి సంపాదించినా చేతిలో డబ్బు నిలవడం లేదని బాధపడుతుంటారు. ఉప్పును ఉపయోగించి మనం సంపాధించిన డబ్బు ఖర్చు కాకుండా చేయవచ్చు. దీని కోసం ఒక కుండలో రాళ్ల ఉప్పును తీసుకుని అందులో మనం సంపాదించిన డబ్బును దాచిపెట్టాలి. ఈ విధంగా డబ్బును ఒక రోజంతా ఉంచిన తర్వాత మరుసరి రోజూ బీరువాలో దాచాలి. ఈ విధంగా చేసినట్లయితే….ఆ డబ్బుకు ఉన్న నెగెటివ్..ఎనర్జీని ఉప్పు గ్రహిస్తుందని పండితులు అంటున్నారు.

ఇక చాలామంది మనం డబ్బు సంపాదిస్తుంటే…చూసి ఈర్ష్య పడుతుంటారు. చెడుగా మాట్లాడుతుంటారు. ఈ విధంగా డబ్బును ఉప్పులో ఉంచడం వల్ల ఇతరుల వల్ల కలిగే నెగెటివ్ ఎనర్జీపోతుంది. సంపాదించిన డబ్బు ఖర్చు కాకుండా ఉంటుంది. దీంతోపాటుగా మంగళవారం ఒక గాజు గిన్నెలో నీళ్లను పోసి అందులో రాళ్ల ఉప్పును వేసి ఇంట్లో ఏదొక మూలలో ఉంచాలి. నీళ్లల్లో వేసిన ఉప్పు కరిగే కొద్ది ఇంట్లో సమస్యలు తగ్గుతుంటాయి. లక్ష్మీదేవి మన ఇంట్లో నుంచి వెళ్లిపోకుండా ఉండేందుకు ఒక గిన్నెలో రాళ్ల ఉప్పును వేసి అందులో ఏడు లవంగాలను ఉంచి ఇల్లంతా తిరిగి…ఈ గిన్నెను ఇంట్లో ఎవరూ తిరగని ప్రదేశంలో ఉంచాలి. ఇలా ఏ రోజైనా సరే చేయవచ్చు.

ఈవిధంగా చేసినట్లయితే…నెగెటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. లక్ష్మీదేవి మన ఇంట్లోనే స్థిరంగా ఉంటుంది. అలాగే మంగళవారం రాత్రి ఒక ఎరుపు వస్త్రంలో రాళ్ల ఉప్పును ఉంచి మూటకట్టి ఈ మూటను ఇంటి ప్రధాన ద్వారానికి కట్టాలి. తర్వాత రోజు అనగా బుధవారం ఆ మూటి విప్పి అందులో ఉన్న ఉప్పును ఏదైనా చెట్టు మొదట్లో పోయాలి. ఇలా చేసిన వారికి ఆ వారమంతా పట్టిందల్లా బంగారం అవుతుందని పండితులు చెబుతున్నారు. ఉప్పుతో ఈ విధంగా చేస్తే…లక్ష్మీదేవి ఇంట్లో నుంచి వెళ్లిపోకుండా స్థిరంగా ఉంటుంది. రుణబాధలు, ఆర్థిక సమస్యలు అన్నీ తగ్గుతాయని…ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు.

Exit mobile version