Site icon HashtagU Telugu

Lakshmi Devi: లక్ష్మీదేవి కాసుల వర్షం కురిపించాలంటే ఈ చిన్న పనులు చేయాల్సిందే?

Mixcollage 11 Feb 2024 03 42 Pm 3835

Mixcollage 11 Feb 2024 03 42 Pm 3835

మామూలుగా ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని, అమ్మవారి ఆశీస్సులు ఉంటే ఏదైనా సాధించవచ్చు అని అనుకుంటూ ఉంటారు. ఇక లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఎన్నెన్నో పూజలు పరిహారాలు కూడా పాటిస్తూ ఉంటారు. వాటితో పాటు వాస్తు ప్రకారంగా మనం చేసే కొన్ని కొన్ని పనులు ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని తేవడంతో పాటు అదృష్టాన్ని తెచ్చి పెడతాయి. కొన్ని పనులతో ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని, అదృష్టాన్ని ఆకర్షించవచ్చని వాస్తు చెబుతోంది. మరి లక్ష్మి అనుగ్రహం కలిగి కాసుల వర్షం కురవాలంటే ఎలాంటి పనులు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

వాస్తు ప్రకారం గా ఇంట్లో విండ్ చైమ్స్, నెమలి ఈకలు,వెదురు మొక్క లాంటి వస్తువులను ఉంచాలి. ప్రతికూలతలను తొలగించి సానుకూల శక్తిని ఆకర్షిస్తాయి. ఇంటికి ఆగ్నేయ మూలలో వెదురు మొక్కను నాటాలి. ఉప్పుతో ఇంటిని తరుచుగా శుభ్రం చేస్తుండాలి. ఉప్పు ప్రతికూల శక్తిని గ్రహించి ఇంటినుంచి బయటకు పంపిస్తుంది. ప్రతి గది మూల చిటికెడు ఉప్పు చల్లి ఒకరోజు గడిచిన తర్వాత తుడిచేయాలి. అలాగే నిత్యం ఉదయం పూట ప్రార్థన లేదంటే ధ్యానం చేయాలి. మనసుకు ప్రశాంతతోపాటు ప్రతికూల శక్తిని ఇవి తొలగిస్తాయి. ఇంట్లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంచడానికి దీపం వెలిగించాలి. ప్రవేశ ద్వారం వద్ద అద్దాన్ని ఎదురుగా ఉంచ కూడదు.

ఇది శక్తిని తిరిగి బౌన్స్ చేస్తుంది. ఇంట్లోకి సానుకూల శక్తి రాకుండా నిరోధించే అవకాశం ఉంది. ఫిష్ ట్యాంక్ లేదంటే వాటర్ ఫౌంటెన్ పెడితే సంపదను, ఆనందాన్ని ఆకర్షిస్తాయి. వీటిలో నీరు సాఫీగా ప్రవహించేలా, శుభ్రంగా ఉంచేలా చూడటం ముఖ్యం. చిందర వందరగా ఉండే ఇల్లు సానుకూల శక్తిని అడ్డుకుంటుంది. అవసరం లేని వస్తువులను పేదలకు ఇవ్వడంతోపాటు ఇంటిని తరుచుగా శుభ్రంగా ఉంచుకుంటుండాలి.