Site icon HashtagU Telugu

Lakshmi Devi: లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించే ముందు ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయో మీకు తెలుసా?

Monday

Monday

లక్ష్మీదేవి అనుగ్రహం కలిగింది అంటే చాలు ఎంతటి పేదవారైనా సరే కోటీశ్వరులు అవ్వాల్సిందే. అయితే అలాంటి లక్ష్మీదేవి అనుగ్రహం కలగడం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు పూజలు పరిహారాలు కూడా చేస్తూ ఉంటారు. లక్ష్మీదేవిని పూజించిన తర్వాత అమ్మవారు మన ఇంట్లోకి వస్తుందని ఎలా తెలుస్తుంది వచ్చేముందు ఏవైనా సంకేతాలు కనిపిస్తాయా అన్న సందేహాలు చాలామందికి కలిగే ఉంటాయి. లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చే ముందు కొన్ని సంకేతాల ద్వారా తెలిసిపోతుందట.

అమ్మవారు కొన్ని సంకేతాలను పంపుతుందట. మరీ అమ్మవారి అనుగ్రహం కలిగింది అని ఎలా తెలుస్తుంది. లక్ష్మి ఇంట్లోకి వచ్చే ముందు ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మన ఇంటికి సంపద రాకముందే దేవుడు కొన్ని సూచనలు ఇస్తాడట. ఈ లక్షణాలు కనిపిస్తే లక్ష్మి మిమ్మల్ని అనుగ్రహిస్తుందని అర్థమట. మీకు కలలో గుడ్లగూబ, చీపురు, ఏనుగు, గులాబీ పువ్వు కనిపిస్తే అది మామూలు కల కాదట. ఇది లక్ష్మీదేవి ఆగమనానికి ప్రతీక అని చెప్తున్నారు. బల్లులను చూడటం మంచి సంకేతంగా పరిగణిస్తారు.

ఇది లక్ష్మీ రాకకు నిదర్శనమని చెబుతున్నారు. ఇంట్లో చీపురు చూడటం కూడా మంచి సంకేతం. మీ ఇంటి చుట్టూ ఉన్న చెత్తను ఎవరైనా ఊడ్చడం చూస్తే ఇంకా మంచిదట. ఇంట్లో పక్షి గూడు కట్టుకోవడం లక్ష్మి రాకకు సంకేతగా చూపించాలట. ఇది మిమ్మల్ని త్వరగా ధనవంతులను చేస్తుందట అరచేతిలో దురద మొదలైతే, త్వరలో డబ్బు మీ చేతికి వస్తుందని చెబుతున్నారు.