Site icon HashtagU Telugu

Dreams: కలలో మీకు ఒక ఇవి కనిపిస్తే చాలు మీ దశ తిరిగినట్టే.. అదృష్టం పట్టిపీడించాల్సిందే?

Mixcollage 14 Feb 2024 09 10 Pm 1792

Mixcollage 14 Feb 2024 09 10 Pm 1792

మామూలుగా మనం పడుకున్నప్పుడు ఎన్నో రకాల కలలు వస్తుంటాయి. అందులో కొన్ని మంచి కలలు అయితే మరి కొన్ని చెడ్డ కలలు. కలల్లో కనిపించే కొన్ని సంఘటనలు మన నిజ జీవితంలో భవిష్యత్ లో జరిగే అనేక సంఘటనలకు సూచనగా చెబుతారు. స్వప్న శాస్త్రంలో కలల్లో వచ్చిన వస్తువులు, వచ్చిన జంతువులు, వచ్చిన వివిధ సంఘటనలకు ఒక అర్థం తప్పనిసరిగా ఉంటుంది. అలాగే కలలో మనకు కొన్ని కనిపించడం అన్నది నిజంగా అదృష్టం అనే చెప్పాలి. కలలో కొన్ని కనిపిస్తే లక్ష్మీ అనుగ్రహం తప్పనిసరిగా కలుగుతుందట. మరి కలలో ఎలాంటి వస్తువులు కనిపిస్తే మంచి జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

కలలో పాము కనిపించినా లేదంటే పాము పుట్ట నుంచి బయటకు వస్తున్నట్లు కనపడితే జీవితంలో ఏదైనా మంచి జరగబోతుందనడానికి సంకేతం. భవిష్యత్తులో అకస్మాత్తుగా డబ్బు వస్తుందనేదానికి ఒక సూచనగా భావించాలి. కలలో చెట్టు ఎక్కినట్లు కనిపిస్తే హఠాత్తుగా డబ్బు అందుకుంటారు. ఆకస్మిక డబ్బు ధనవంతులుగా మారుస్తుంది. నృత్యం చేస్తున్న స్త్రీని కలలో చూడటం శుభప్రదం. భవిష్యత్తులో ఆకస్మిక చెల్లింపులుంటాయనేదానికి సంకేతం. కలలో బంగారాన్ని చూస్తే లక్ష్మీదేవి వస్తుందనడానికి సంకేతంగా బావించాలి. త్వరలోనే డబ్బు, బంగారం పొందుతారు. అలాగే కలలో తేనెటీగ గూడును చూసిన కూడా మంచిదే. ఇలా కనిపిస్తే అకస్మాత్తుగా డబ్బును పొందుతారు. కలలో ఎలుకపై గణేషుడు సవారీ చేయడం శుభ సంకేతంగా పరిగణిస్తారు.

ఎల్లుకను చూడటమంటే ఇంట్లోకి డబ్బు వస్తుందనేదానికి సంకేతం. విడిగా కాకుండా ధరించిన ఉంగరం చూస్తే అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఎరువు లేదా ముత్యాల ఉంగరం కనపడటం వల్ల ప్రత్యేక ప్రయోజనాలు ఉంటాయి. ఎద్దులబండి కనిపిస్తే పెద్ద తిరుగుబాటు జరగబోతోందని అర్థం. చీకటి మేఘాలు కనపడటం అశుభం. జీవితంలో కొన్ని అడ్డంకులను ఎదుర్కోబోతున్నారని అర్థం. నల్ల కాకి కనిపిస్తే అశుభం. పెద్ద ప్రమాదం జరగబోతోందని అర్థం. లేదంటే మీకు దగ్గరగా ఉండేవారి మరణవార్తను వింటారనే అర్థం. రక్తస్రావం కనిపిస్తే జాగ్రత్తగా ఉండాలి.