Kamadhenu Remedies: ఆవుకి ఈ ఒక్క వస్తువు పెడితే చాలు అష్టైశ్వర్యాలు మీ వెంటే?

Kamadhenu Remedies: భారతదేశంలో ఆవుని గోమాతగా పిలుస్తారు. అంతేకాకుండా హిందూమతంలో ఆవుకి తల్లి హోదా కూడా ఉంది. ఆవు శరీరంలో ముక్కోటి దేవతలు నివసిస్తుంటారు అని చెబుతూ ఉంటారు

  • Written By:
  • Publish Date - October 22, 2022 / 07:30 AM IST

Kamadhenu Remedies: భారతదేశంలో ఆవుని గోమాతగా పిలుస్తారు. అంతేకాకుండా హిందూమతంలో ఆవుకి తల్లి హోదా కూడా ఉంది. ఆవు శరీరంలో ముక్కోటి దేవతలు నివసిస్తుంటారు అని చెబుతూ ఉంటారు. అందుకే హిందువులు ఆవుని గోమాత అని పిలుస్తూ పూజ చేస్తూ ఉంటారు. అలాగే సనాతన ధర్మం ప్రకారం గోవుకు సేవ చేసే వారికి ఇంట్లో దరిద్రం ఉండదు అని చెబుతూ ఉంటారు. అలాగే గోవును దానం చేయడం కూడా ఒక గొప్ప దానంగా పరిగణిస్తారు. అటువంటి గోమాతకు కొన్ని ఆహార పదార్థాలను పెట్టడం వల్ల జీవితంలో డబ్బు అన్న దానికి కొదవ ఉండదు.

అంతేకాకుండా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉద్యోగం అనుభవిస్తారు. మరి గోమాతకు ఎటువంటి ఆహార పదార్థాలను ఇవ్వాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అవుకు బెల్లం లేదా రొట్టెతో కలిపిన బెల్లం ఆహారంగా పెట్టడం ఎంతో మంచిది. శ్రవణ్ తప్పకుండా ఆవుకి రొట్టెలో బెల్లం కలిపి తినిపించే వ్యక్తి అనుకున్నది సాధించడంతో పాటు ప్రతిరంగంలో కూడా అభివృద్ధి చెందుతాడు. అటువంటివారు నిరంతరం పురోగతిని పొందుతారు. అదేవిధంగా ప్రతిరోజు ఆవుకి బెల్లం రోటిని తినిపించే వ్యక్తి అతింద్రీయ శక్తి సహాయం పొందుతాడు.

అలాగే ఎటువంటి పనులు అయితే నెరవేరకుండా పెండింగ్ ఉంటాయో ఆ పనులన్నీ కూడా నెరవేరుతాయి. సంతాన్ని, సంతోషాన్ని కోరుకునే వారు ప్రతిరోజు ఉదయం ఆవుకి బెల్లం తినిపించాలి. ఈ విధంగా చేయడం వల్ల సంతానం కలగడంతో పాటు తెలివైన పిల్లలు పుడతారు. అలాగే ఆవుకు నిత్యం బెల్లం రోటిని తినిపిస్తే పుణ్యం లభిస్తుంది. అంతేకాకుండా అష్టైశ్వర్యాలను పొందడంతో పాటు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉంటారు. ఎటువంటి వ్యాధులు కూడా దరిచేరవు. మరి ముఖ్యంగా చెప్పాలి అంటే.. గోమాతకు సేవ చేస్తూ బెల్లం తినిపించడం, రోటిని తినిపించడం లాంటివి చేసే వారికి 33 వర్గాల దేవతల ఆశీస్సులు తప్పకుండా లభిస్తాయి.