Clocks Tree : ఎన్నో మహిమాన్విత పుణ్య క్షేత్రాల గురించి మనకు తెలుసు. ఆయా పుణ్యక్షేత్రాల్లో కోరుకునే కోర్కెలు నెరవేరుతాయి. ఇదే భక్తుల అపారమైన నమ్మకం. దీన్ని ఎవరూ కాదనలేరు. ఆధ్యాత్మికతకు ఉన్న శక్తి అనంతమైంది. అది ఎలాంటి అసాధ్యాన్నైనా సుసాధ్యంగా మార్చగలదు. ఇప్పుడు మనం భక్తుల కోర్కెలు తీర్చే విశిష్టమైన ‘క్లాక్ ట్రీ’ గురించి తెలుసుకోబోతున్నాం. వివరాలివీ..
Also Read :X Sold To xAI : ఎక్స్‌ను అమ్మేసిన ఎలాన్ మస్క్.. డీల్ విలువ రూ.2.82 లక్షల కోట్లు
ఒక మర్రిచెట్టు.. ఘడీ వాలే బాబా
క్లాక్ ట్రీని చూడాలంటే మనం మధ్యప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లాలి. ఉజ్జయిని(Clocks Tree) జిల్లా కేంద్రానికి 45 కిలోమీటర్ల దూరంలోని ఉన్హెల్ తహసీల్ పరిధిలోనే ఒక పేద్ద మర్రిచెట్టు ఉంటుంది. దాని నిండా తీరొక్క గడియారాలు వేలాదిగా వేలాడుతూ ఉంటాయి. అవన్నీ భక్తులు కట్టినవే. ఈ మర్రిచెట్టు ఉన్న ప్రదేశాన్నే ‘ఘడీ వాలే సాగస్ బాబా’ అని భక్తులు పిలుస్తుంటారు. కొందరు దీన్ని ఘడీ వాలే బాబా అని కూడా పిలుస్తారు. ఈ మర్రిచెట్టు దగ్గర పూజారి ఉండడు. భక్తులే నేరుగా మర్రిచెట్టుకు సంబంధించిన వేదికపైకి ఎక్కి నమస్కారాలు సమర్పించాలి. తమ కోరికను భక్తితో వినిపించాలి. ఆ కోరిక తీరిన తర్వాత వచ్చి.. చెట్టుకు గడియారాన్ని కట్టి మొక్కును తీర్చుకోవాలి. ఈవిధంగా కోర్కెలు తీరిన వారంతా కట్టిన గడియారాలే.. ఇప్పుడు ఈ మర్రిచెట్టు నిండా వేలాడుతున్నాయి. టిక్ టిక్ శబ్దాలను భక్తులకు ఆశీర్వాదంగా వినిపిస్తున్నాయి. ‘‘మీకు మంచి టైం మొదలు కాబోతోంది’’ అనే సానుకూల సంకేతాలను ధ్వనింపజేస్తున్నాయి.
Also Read :Maoists Encounter: ఛత్తీస్‌గఢ్‌లో మరో ఎన్‌కౌంటర్.. 16 మంది మావోయిస్టులు హతం
బ్యాడ్ టైం ఆగిపోయి.. గుడ్ టైం
ఘడీ వాలే బాబా మర్రిచెట్టుకు భక్తులు సమర్పించే గడియారాల్లో చిన్నవి,పెద్దవి అన్నీ కలిసి ఉంటాయి. భారీ ధరకు గడియారాలను కొని సమర్పించే భక్తులు కూడా ఉన్నారు. గడియారంతో పాటు కొబ్బరికాయ, ధూపం కర్రలు, సిగరెట్లు, చిల్లంలను కూడా నైవేద్యంగా సమర్పిస్తారు. తద్వారా తమ బ్యాడ్ టైం ఆగిపోయి, గుడ్ టైం మొదలవుతుందని భక్తులు విశ్వసిస్తారు.