Today Horoscope : సెప్టెంబరు 13 బుధవారం రాశిఫలాలు.. వారికి ఆవేశంతో నష్టం

Today Horoscope : మేష రాశి నుంచి మీన రాశి వరకు ఈరోజు రాశి ఫలితాలు ఇవీ..  

  • Written By:
  • Updated On - September 13, 2023 / 06:40 AM IST

Today Horoscope : మేష రాశి నుంచి మీన రాశి వరకు ఈరోజు రాశి ఫలితాలు ఇవీ..  

మేష రాశి

ఈరోజు మేషరాశి వారికి సంతాన సౌఖ్యం ఉంది. వ్యాపారస్తులకు అనుకూలం. ప్తీలకు అనుకూలం. విద్యార్థులకు కలసివచ్చే రోజు. విఘ్నేశ్వరుడిని పూజించండి. గణేశుడికి అరటిపళ్ళు, కొబ్బరికాయ నివేదించి.. బెల్లాన్ని నైవేద్యంగా సమర్పిస్తే విఘ్నాలు తొలగుతాయి.

వృషభ రాశి

ఈరోజు వృషభ రాశిలోని వ్యాపారస్తులకు లాభదాయకం. ఉద్యోగస్తులకు అనుకూలం. వృత్తి ఉద్యోగస్తులకూ కలిసి వస్తుంది. భగవద్గీత వినండి. చదవండి.  కృష్ణాష్టకం చదవండి. దీనివల్ల శుభఫలితాలు కలుగుతాయి. పాలతో చేసిన ప్రసాదాల్ని శ్రీకృష్ణుడికి సమర్చించాలి.

మిథునం

ఈరోజు మిథునరాశి వారిపై ఒత్తిళ్ళు పెరుగుతాయి. అయినా ఆవేశానికి దూరంగా ఉండాలి. కుటుంబంలో గొడవలు, వాగ్వాదం జరగొచ్చు. ఉద్యోగులకు, వ్యాపారులకు మధ్యస్థముగా ఉన్నది. విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయాల్లో అర్చన చేయండి.

Also read:Mushrooms: వర్షాకాలంలో పుట్టగొడుగులు తింటున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే?

కర్కాటకం

ఈరోజు కర్కాటక రాశిలోని వ్యాపారస్తులకు అనుకూలం. ఉద్యోగస్తులపై ఒత్తిళ్ళు పెరుగుతాయి. అయినా అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఆరోగ్య విషయాల్లో అలర్ట్ గా ఉండండి. కుటుంబ విషయాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. వెంకటేశ్వరస్వామిని పూజించండి.

సింహం

ఈరోజు సింహరాశి వారిని అధిక ఖర్చులు ఇబ్బందిపెట్టును. వృత్తి ఉద్యోగ వ్యాపారస్తులకు శారీరక శ్రమ పెరుగుతుంది. కుటుంబంలో అశాంతి కలుగుతుంది. స్త్రీలు ఆరోగ్య విషయాల్లో అప్రమ్తతంగా ఉండాలి. వినాయకుడిని పూజించండి.

కన్య (Today Horoscope)

ఈరోజు కన్యారాశిలోని  వ్యాపారస్తులకు లాభదాయకం. స్త్రీలకు కుటుంబములో సమస్యలు పెరుతాయి. సంయమనంతో వ్యవహరించాలి. పెద్దల సలహాలు తీసుకోవాలి. ఆవేశం పనికిరాదు.  శ్రీకృష్ణుడిని పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.

Also read:Beauty Tips: చుండ్రు సమస్యకు వేపాకుతో చెక్ పెట్టిండిలా?

తుల

ఈరోజు తులారాశి వారికి మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలున్నాయి. జన్మరాశియందు కేతువు, వ్యయస్థానమునందు కుజుని ప్రభావం వలన కుటుంబ సభ్యులతో వివాదాలు ఏర్పడు సూచన. ఉద్యోగస్తులకు దశమంలో శుక్రుని ప్రభావం వలన అనుకూల ఫలితాలు కలుగును. వ్యాపారస్తులకు ఖర్చులు అధికముగా ఉండును. ప్రయాణములు కలసివచ్చును. కుటుంబ సౌఖ్యం పొందెదరు. విష్ణు సహస్రనామపారాయణ చేయడం, విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయాల్లో అర్చన వంటివి చేయించుకోవడం అలాగే ఆలయదర్శనం చేసుకోవడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. మహావిష్ణువు యొక్క అష్టోత్తర శతనామావళి పఠించండి.

వృశ్చికం

ఈరోజు వృశ్చిక రాశి వారికి అనుకూలంగా ఉంది. బుధుడు దశమంలో రవితో కలసి అనుకూలంగా సంచరిస్తున్నాడు. దీనివల్ల ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు కలిసి వస్తుంది. కుజుని ప్రభావం వలన స్త్రీలకు కుటుంబ సౌఖ్యం కలిగే అవకాశం ఉంది. శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం చదవండి, వినండి.

ధనుస్సు

ఈరోజు ధనుస్సు రాశిలోని వ్యాపారస్తులకు లాభదాయకం. స్త్రీలకు కుటుంబ సమస్యలు ఏర్పడును.  అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. శని, గురు, రాహువుల అనుకూలత కారణంగా అనుకున్న పనులను మీరు పూర్తి చేస్తారు. వినాయకుడిని పూజించండి.

మకరం

ఈరోజు మకర రాశి వారికి ఆరోగ్య సమస్యలు కలిగే సూచన ఉంది.  ఆయుః స్థానంలో రవి, బుధుల ప్రభావం ఉంది. మానసిక ఒత్తిడి కూడా పెరుగుతుంది. శారీరక శ్రమ పెరుుగుతుంది. గురు, రాహువులు, కుజుని అనుకూల ప్రభావం వలన ముఖ్యమైన పనులు పూర్తి చేయగలుగుతారు. విద్యార్థులు కష్టపడితే ఫలితం వస్తుంది.  శ్రీకృష్ణుడిని పూజించండి.

కుంభం

ఈరోజు కుంభ రాశిలోని వ్యాపారస్తులకు కలిసొస్తుంది. బుధుడు, రవితో కలసి కళత్రములో సంచరించడం ప్లస్ పాయింట్ గా మారుతుంది. చంద్రుని అనుకూల ప్రభావంతో మీ పనులన్నీ పూర్తవుతాయి. ఇతరులకు వాగ్వాదం మైనస్ అవుతుంది. బీ అలర్ట్. స్టూడెంట్స్ కు గుడ్ టైం.  విష్ణువును పూజించండి.

మీనం 

ఈరోజు మీన రాశి వారిపై నరఘోష ఎక్కువ. శత్రు స్థానములో రవి బుధుల సంచారం వలన ఈ ప్రాబ్లమ్ వస్తుంది. వ్యాపారస్తులకు ఖర్చులు బాగా పెరుగుతాయి. వాటిని కంట్రోల్ చేసుకోవాలి. ఏలినాటి శని ప్రభావం వల్ల మీ ఖర్చులు పెరుగును. వాక్‌ స్థానంలో గురు, రాహువుల ప్రభావం కారణంగా మీరు ఎవరితో గొడవలకు దిగకూడదు. వెంకటేశ్వరస్వామిని పూజించండి.

గమనిక:  ఈ కథనంలో ఉన్న సమాచారం జ్యోతిష్యులు/ పంచాంగాలు/ ఉపన్యాసాలు/నమ్మకాలు/గ్రంధాల నుండి సేకరించిన తర్వాత మీ ముందుకు తీసుకురాబడింది. మా లక్ష్యం సమాచారాన్ని అందించడం మాత్రమే, దాని వినియోగదారులు దానిని కేవలం సమాచారంగా తీసుకోవాలి. అదనంగా, దాని యొక్క ఏదైనా ఉపయోగం వినియోగదారు యొక్క పూర్తి బాధ్యత.