Today Horoscope : సెప్టెంబరు 8 శుక్రవారం రాశి ఫలాలు.. వారు జాగ్రత్తగా మాట్లాడాలి

Today Horoscope : మేష రాశి నుంచి మీన రాశి వరకు ఈరోజు రాశి ఫలితాలు ఇవీ..  

  • Written By:
  • Updated On - September 8, 2023 / 08:55 AM IST

Today Horoscope : మేష రాశి నుంచి మీన రాశి వరకు ఈరోజు రాశి ఫలితాలు ఇవీ..  

మేష రాశి

ఈరోజు మేషరాశి  వారు ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండాలి. ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. మీ ఆలోచనా శక్తితో సమస్యల నుంచి బయటపడెదరు. ఆలోచనల్లో స్థిరత్వం ఉండేలా చూసుకోవడం మంచిది. మహాలక్ష్మి అష్టకాన్ని పఠించాలి.

వృషభ రాశి

ఈరోజు వృషభ రాశి వారు కోపాన్ని తగ్గించుకోవాలి. మీ అభిప్రాయాలను ఎవ్వరిపైనా రుద్దకూడదు.  విద్యార్థులకు కలసివచ్చే రోజు. ఉద్యోగ వ్యాపారపరంగా సత్ఫలితాలు పొందుతారు. ఈ రోజు బిజీబిజీగా ఉంటారు. ప్రేమికులకు ఇబ్బందులు ఎదురవుతాయి. లక్ష్మీదేవిని పూజించండి.

మిథునం

ఈరోజు మిథునరాశిలోని ఉద్యోగులకు పని ఒత్తిళ్ళు ఎదురవుతాయి. వ్యాపారస్తులకు ఖర్చులతో కూడిన సమయం. కుటుంబ వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. కుటుంబ సభ్యులతో వాదనలు ఏర్పడును. వ్యాపారంలో ద్రవ్య ప్రయోజనాలను పొందుతారు.  లక్ష్మీదేవిని పూజించండి.

Also read: Tirumala Leopard Roaming : వామ్మో ఇంకో రెండు చిరుతలా..? హడలిపోతున్న వెంకన్న భక్తులు..

కర్కాటకం

ఈరోజు కర్కాటక రాశి వారు ప్రారంభించిన పనులు ఆలస్యంగా పూర్తవుతాయి. జాగ్రత్తగా ఉండాలి.  ప్రమాద సూచనలున్నాయి. పెట్టుబడులు పెట్టే ముందు అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం మంచిది. పాత అప్పులు తీర్చాలనే ఒత్తిడి మీపై ఉంటుంది. ఒంటరిగా ఉండాలి అనుకోవద్దు.రైతాంగం, సినీరంగం వారికి మధ్యస్థ సమయం. విష్ణు సహస్రనామం పఠించండి.

సింహం

ఈరోజు సింహరాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరంగా ఒత్తిళ్ళు అధికము. ఉద్యోగాల్లో సహోద్యోగుల నుంచి ఇబ్బందులు ఉంటాయి. వ్యాపారస్తులకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. వ్యాపారంలో నగదు సమస్య తీరుతుంది. పెద్ద కంపెనీ నుంచి ఉద్యోగ అవకాశం పొందుతారు. మహాలక్ష్మి అష్టకాన్ని పఠించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

కన్య (Today Horoscope)

ఈరోజు కన్యారాశి వారు పొదుపు పాటించాలి. భోగభాగ్యాలు కలుగును. వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా అనుకూలం. కొన్ని ప్రత్యేక పనులు పూర్తిచేసేందుకు ప్లాన్ చేసుకుంటారు. భార్యాభర్తల మధ్య సహకారం ఉంటుంది. ఉద్యోగులు, వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు. లక్ష్మీదేవిని పూజించండి.

తుల

ఈరోజు తులారాశి వారి మనసులో వికృతమైన ఆలోచనలు తలెత్తే అవకాశం ఉంది. జాగ్రత్త పడండి. అపరిచితులను నమ్మొద్దు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండాలి. నిర్ణయాలు తీసుకోవడంలో తొందరపాటు వద్దు. కొన్ని సందర్భాల్లో మనసుకు భయం కలుగుతుంది. ఒత్తిడిని జయించాలి. కష్టపడితేనే విజయం. లక్ష్మీదేవిని పూజించాలి.

వృశ్చికం

ఈరోజు వృశ్చిక రాశివారు వ్యక్తిగత సమస్యలను ఇతరులతో పంచుకోవద్దు. సంకోచించకుండా నిర్ణయాలు తీసుకోవాలి. విఘ్నాలను అవలీలగా అధిగమిస్తారు. సహోద్యోగులతో జాగ్రత్త. ప్రలోభాలకు లొంగరాదు. పిల్లల కెరీర్ విషయంలో కొంత ఆందోళన ఉంటుంది. ప్రేమ సంబంధాలలో భావోద్వేగాలుంటాయి. అష్ట లక్ష్మీ స్తోత్రాన్ని పఠించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

ధనుస్సు

ఈరోజు ధనుస్సు రాశి వారికి వృధా ప్రయాణాలుంటాయి. వ్యయాలు పెరగకుండా జాగ్రత్తపడాలి. వ్యాపార లాభాలున్నాయి. భూలాభమూ ఉంది. వ్యాపారంలో చిక్కుకున్న డబ్బును తిరిగి పొందుతారు. కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. మహాలక్ష్మి అష్టకాన్ని పఠించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

మకరం

ఈరోజు మకర రాశి వారికి ఆర్థికంగా మిశ్రమ కాలం. వ్యయభారం విషయంలో జాగ్రత్తపడాలి. వ్యతిరేకంగా మాట్లాడేవారున్నారు జాగ్రత్త. మాటల్లో తీయదనం ఉండాలి. విమర్శించకూడదు. ప్రమాదాలకు దూరంగా ఉండండి. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో శుభ ఫలితాలు ఉన్నాయి. ప్రయాణాలు కలసివస్తాయి. మీ వర్కింగ్ స్టైల్ మార్చుకుంటే మరిన్ని మంచి ఫలితాలు సాధిస్తారు. కుటుంబ కలహాలు పరిష్కారమయ్యే అవకాశాలు ఉన్నాయి. గణపతిని పూజించండి.

Also read:India’s First UPI-ATM Launched : అందుబాటులోకి UPI ఏటీఎం..ఇక ఏటీఎం కార్డుతో పనిలేదు

కుంభం

ఈరోజు కుంభ రాశి వారు ఏదో విషయంలో బాధగా ఉంటారు. వివాహేతర సంబంధాలకు దూరంగా ఉండాలి. బంధువులను ఎక్కువగా నమ్మకపోవడమే మంచిది. శ్రమ అవసరం. శక్తివంచన లేకుండా పనిచేస్తే సంతృప్తికర ఫలితాల్ని సాధిస్తారు. లక్ష్మీదేవిని పూజించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

మీనం 

ఈరోజు మీన రాశి వారికి కార్యాలయంలో సీనియర్లతో విభేదాలు ఉండొచ్చు. పిల్లల కార్యకలాపాలపై నిఘా ఉంచండి. ఏ విషయంలోనూ అశ్రద్ధ వద్దు. అధికారుల వద్ద కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి. కొన్ని పొరపాట్లు జరిగే ఆస్కారం లేకపోలేదు. ధైర్యం, ఏకాగ్రత రెండూ ముఖ్యం. అష్ట లక్ష్మీ స్తోత్రాన్ని పఠించండి.

గమనిక:  ఈ కథనంలో ఉన్న సమాచారం జ్యోతిష్యులు/ పంచాంగాలు/ ఉపన్యాసాలు/నమ్మకాలు/గ్రంధాల నుండి సేకరించిన తర్వాత మీ ముందుకు తీసుకురాబడింది. మా లక్ష్యం సమాచారాన్ని అందించడం మాత్రమే, దాని వినియోగదారులు దానిని కేవలం సమాచారంగా తీసుకోవాలి. అదనంగా, దాని యొక్క ఏదైనా ఉపయోగం వినియోగదారు యొక్క పూర్తి బాధ్యత.